OTT:ఓటీటీలోకి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ.. ముందుగానే రిలీజ్.. ఎప్పుడు? ఎక్కడంటే?
Appudo Ippudo Eppudo OTT Update: కార్తికేయ 2 సినిమాతో ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. ఈ పాపులర్టీతో వరుస సినిమాలు ఆఫర్ అందుకున్నారు. క్రమంలోనే నిఖిల్- సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Appudo Ippudo Eppudo). ఈ మూవీ ఎలాంటి హడావిడి లేకుండా .. నవంబర్ 8 (నేడు) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీకి సంబంధించిన ఓటిటీ అప్డేట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
సుధీర్ వర్మ- నిఖిల్ కాంబోలో ఇప్పటికే 'స్వామి రారా ', 'కేశవ' సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో 'స్వామి రారా' మూవీ మంచి మంచి విజయాన్ని అందుకోగా.. 'కేశవ' మూవీ పరవాలేదు అనిపించింది. ఈ కాంబో మూడో సారి 'అప్పుడు ఇప్పుడు ఎప్పుడో' మూవీతో మళ్లీ రిపీట్ అయింది. ఈ మూవీనీ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీలో వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో అజయ్, వైవా హర్ష, జాన్ విజయ్, సుదర్శన్, సత్య లు ప్రధాన పాత్రలో నటించారు.

అలాగే.. రొమాంటిక్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా లో జాన్ విజయ్, అజయ్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాకు ప్రముఖ సింగర్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. సన్నీ ఎంఆర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. స్వామి రారా, కేశవ సినిమాలకు కూడా సన్నీ ఎంఆర్‌నే సంగీతం అందించిన విషయం తెలిసిందే.ఈ మూవీ ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే థియేటర్లోకి అడుగుపెట్టింది
అప్పుడు ఇప్పుడు ఎప్పుడో కథ విషయానికి వస్తే.. రిషి (నిఖిల్ సిద్ధార్థ).. ఇతడు ఒక ఫార్ములా వన్ రేసర్. అతనికి తార (రుక్మిణి వాసంత్) అనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది ఆమెకు రిషి అంటే చాలా ఇష్టం.కానీ, తారను పట్టించుకోడు రిషి. ఈ క్రమంలో ప్రమాదంలో ఉన్న తులసి (దివ్యాంశ కౌశిక్) రక్షిస్తాడు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ ఏర్పడుతుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ, సడెన్ గా పెళ్లి పీటల నుండి తులసి పారిపోతుంది. దీంతో రుషి మళ్లీ రుక్మిణికి దగ్గరవుతాడు. ఈ క్రమంలో రుషిని బద్రి (జాన్ విజయ్)అనే గ్యాంగ్ లీడర్ వెంటాడుతాడు. ఇంతకీ తులసీ పెళ్లి మీటర్లు పెళ్లి పీటల మీద నుండి ఎందుకు పారిపోయింది రిషి నీ వెంబడించే గ్యాంగ్ ఎవరు? తులసిని రిషి రక్షిస్తాడా? లేదా?అనేది ఈ సినిమా.

ఇక అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయానికి వస్తే.. వాస్తవానికి ఈ మూవీని ఓటిటి కోరిక కోసమే. ఇలాంటి ప్రమోషన్స్ లేకుండా విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీ డైరెక్టర్ సుధీర్ వర్మ మాట్లాడుతూ.. ఓటీటీ సంస్థ కోసమే ఈ మూవీని ఇంత ఫాస్ట్ గా రిలీజ్ చేశామని, ఇప్పుడు డేట్లు మిస్ అయితే ఏప్రిల్- మే వరకు ఈ సినిమాకు ఓటీటీ స్లాట్స్ దొరకడం లేదని, ఆ కారణంతోనే సడన్ గా రిలీజ్ చేశామని తెలిపారు. దర్శకులు సుధీర్ వర్మ చెప్పిన ప్రకారం ఈ మూవీ డిసెంబర్ చివరి నాటికి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానున్నది.


Click it and Unblock the Notifications











