OTTలోకి రీసెంట్ సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

సంక్రాంతి పండక్కి థియేటర్లలో పెద్ద సినిమాలు సందడి చేస్తున్నాయి. తేజ సజ్జా హనుమాన్, మహేశ్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్ ఇప్పటికే రిలీజ్ అయి థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇక రేపు నాగార్జున నా సామి రంగ రిలీజ్ కానుంది. ఈ సంక్రాంతికి థియేటర్లలో పెద్ద హీరోలు సందడి చేస్తుంటే.. ఓటీటీలోకి సంక్రాంతి పండుగ కానుకగా ఓటీటీ ప్రేక్షకుల కోసం ఒక సూపర్ హిట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సంక్రాంతి పండక్కి ఓటీటీలు కొత్త కొత్త సినిమాలు తీసుకువస్తున్నాయి. అందులో భాగంగానే టాలీవుడ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్‌ సెన్సేషన్‌ ఎక్స్ ట్రా ఆర్టినరి మ్యాన్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సిినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ ఈ కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ సినిమాకు దర్శకత్వం వహించాడు.

 Nithiin Sreeleela Extra Ordinary Man Movie Going To Streaming on Disney Plus Hotstar OTT From Jan 19th Full Details Here

ఇక సీనియర్‌ హీరో, యంగ్రీ మ్యాన్ రాజశేఖర్‌ ఈ సినిమాలో కీ రోల్ పోషించారు. ఈ సినిమా డిసెంబర్‌ 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. 'ఎక్స్‌ ట్రా ఆర్డినరి మ్యాన్' బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదల సమయంలోనే నాని హాయ్ నాన్న విడుదల కావడం.. దానికి తోడు రణబీర్ కపూర్ సందీప్ వంగా కాంబోలో వచ్చిన యానిమల్ థియేటర్లలో ఉండటం ... ఈ సినిమాకు మైనస్‌ గా మారింది.

నాని నటించిన హాయ్‌ నాన్న సినిమాకు మంచి పాజిటివ్ వచచింది. దీంతో ఈ కామెడీ ఎంటర్ టైనర్ పోటీలో వెనకబడింది. ఓ మోస్తరు కలెక్షన్లతోనే నితిన్ ఈ సినిమాతో సరిపెట్టుకున్నారు. అయితే సినిమాలో నితిన్‌, శ్రీలీల డ్యాన్సులు, కామెడీ సీన్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక డేంజర్‌ పిల్ల సాంగ్‌ యూట్యూబ్‌లో చార్ట్‌ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో విశేషాలున్న ఎక్స్‌ ట్రా ఆర్డినర్‌ మ్యాన్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు రెడీ అయిపోయింది.

 Nithiin Sreeleela Extra Ordinary Man Movie Going To Streaming on Disney Plus Hotstar OTT From Jan 19th Full Details Here

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ నితిన్‌, శ్రీలీల మూవీ డిజిటల్‌ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఎక్స్‌ట్రా ఆర్డినర్‌ మ్యాన్‌ ఓటీటీ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటనను తన సోషల్ మీడియా ఖాతా వేదికగా పంచుకుంది. ఈ మూవీని సంక్రాంతి కానుకగా ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

నితిన్, శ్రీలీల ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ మూవీ జనవరి 19వ తేదీన డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేసింది సంస్థ. ఇక ఈ సినిమాలో రావు రమేష్, పవిత్రా లోకేష్‌, బ్రహ్మాజీ, సుధేవ్ నాయర్, సంపత్‌ రాజ్‌, అజయ్ హర్షవర్దన్, హరి తేజ, రోహిణీ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్‌ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాకు హరిస్‌ జయరాజ్ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X