OTTలోకి రీసెంట్ కామెడీ ఎంటర్టైనర్.. ఎందులో చూడాలంటే?

ఓటీటీలో ఈ సంక్రాంతికి నవ్వులు పూయించే కడుపుబ్బా నవ్వించే సినిమా రాబోతుంది. థియేటర్లలో పెద్ద సినిమాలు.. ఓటీటీలో కొత్త సినిమాలు... థియేటర్లకి పోయే ఓపిక లేని వారు ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సినిమా రాబోతుంది. కామెడీ కమర్షియల్ జోనర్ లో తెరకెక్కిన నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఆ సినిమా ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జయం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి... సూపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నితిన్. ఇక ఆ తర్వాత దిల్ సినిమాలో కమర్షియల్ హిట్టున సైతం సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాల తర్వాత ఈ కుర్ర హీరోకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఎన్నో సూపర్ హిట్లు, ఎన్నో పరాజయాలు అందుకున్నాడు. ఇటీవల కాలంలో నితిన్ కు వరుస పరాజయాలు వస్తున్నాయి. కాలం అంతగా కలిసి రావడం లేదని తెలుస్తోంది.

Nithiin Sreeleela Extra Ordinary Man Movie Going to Streaming on Netflix Jan 12th Full Details Here

మాచర్ల నియోజకవర్గం ఫ్లాప్ తర్వాత ఎన్నో అంచనాల నడుమ నితిన్ ఎక్స్ ట్రా ఆర్టినరీ మ్యాన్ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత ఆయన కూడా ఈ సినిమా హిట్ అవుతుందని భావించారు. అయితే సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినా.. థియేటర్లలో నిలదొక్కుకోలేకపోయింది. దానికి కారణం సినిమా కరెక్ట్ టైంకు రాలేదని తెలుస్తోంది.

డిసెంబర్ 8న రిలీజ్ అయిన ఈ సినిమా... అప్పటికే థియేటర్లలో రణబీర్ కపూర్ యానిమల్ సినిమా నడుస్తుంది. మరోవైపు నాని నటించిన హాయ్ నాన్న ఎమోషనల్ సినిమా రన్ అవుతుంది. ఈ రెండు సినిమాల మధ్య నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ నలిగిపోయిందనే చెప్పాలి. కామెడీ క‌మ‌ర్షియ‌ల్ జోన‌ర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించగలిగింది కానీ.. వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అయింది.

నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సంక్రాంతికి ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. మంచి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొడంతో ఈ సినిమాకు మంచి బిజినెస్ నమోదు చేసుకుంది. ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ ఓటీటీ హ‌క్కుల‌ను భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సిినిమా ఓటీటీలో సంక్రాంతి కానుకగా జనవరి 12 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Nithiin Sreeleela Extra Ordinary Man Movie Going to Streaming on Netflix Jan 12th Full Details Here

ఇక ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమా విషయానికి వస్తే... వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో నితిన్ జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా, పోలీస్ ఆఫీస‌ర్‌గా డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన పాత్రలో నటించాడు. శ్రీలీల హీరోయిన్‌గా, హీరో రాజ‌శేఖ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ఓ ఇంపార్టెంట్ రోల్‌లో క‌నిపించాడు. హ‌రీస్ జైరాజ్ సంగీతాన్ని అందించగా.... నితిన్ తండ్రి సుధాక‌ర్‌రెడ్డి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇక ఈ సినిమాను మీరు థియేటర్లలో మిస్ అయితే కనుగా ఓటీటీలో చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X