Extra Ordinary Man: ఓటీటీలోకి వచ్చేసిన నితిన్ మూవీ.. శ్రీలీల ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్
టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది హీరోలు మాత్రం ఫ్లాపులు వస్తున్నా ఏమాత్రం బ్రేకులు లేకుండా కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. అలాంటి వారిలో యూత్ స్టార్ నితిన్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఇటీవలే నితిన్ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
యూత్ స్టార్ నితిన్ నటించిన తాజా సినిమానే 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్'. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో ప్రేక్షఖుల ఆదరణ పెద్దగా లభించడం లేదు. ఫలితంగా ఓపెనింగ్స్ అంతగా రాలేదు. ఆ తర్వాత కూడా స్పందన లేకపోవడంతో ఈ క్రేజీ మూవీకి వసూళ్లు మరీ తక్కువగా వచ్చి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే మిగిల్చింది.

'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీపై ఆరంభం నుంచీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్‌కు భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ఫేమస్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుంది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.
నితిన్ నటించిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను జనవరి 19వ తేదీ అర్ధరాత్రి నుంచే ఆ ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకుని వచ్చేశారు.

వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ - శ్రీలీల నటించిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీ ఒరిజినల్ వెర్షన్‌నే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెన్సార్‌లో కట్ అయిన సీన్స్‌ను, డైలాగులను కూడా యాడ్ చేశారని తెలిసింది. అంతేకాదు, శ్రీలీలకు సంబంధించిన కొన్ని సీన్స్ కూడా యాడ్ చేశారని సమాచారం.
'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిలు నిర్మించారు. శ్రీలీల హీరోయిన్‌గా చేసిన ఈ మూవీలో రాజశేఖర్ సర్‌ప్రైజింగ్ రోల్ చేశారు. అలాగే, రావు రమేష్, సుదేవ్ నాయర్ తదితరులు నటించారు. హరీష్ జయరాజ్ మ్యూజిక్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











