Extra Ordinary Man OTT: ఓటీటీలోకి రాబోతున్న నితిన్ కొత్త సినిమా.. ఎప్పుడు, ఎలా చూడాలంటే?

అద్భుతమైన కథలతో అందరినీ అలరిస్తూ.. మన పక్కింటి కుర్రాడిలా కనిపించే నితిన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2002లో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన నితిన్.. ఇప్పటికీ హీరోగా కొనసాగుతూనే ఉన్నారు. 20 ఏళ్ల పాటు చాలా యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తూ.. అదే ఫిజిక్ ను మెయింటేన్ ను చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా గత మూడేళ్లుగా ఆయనకు ఒక్క హిట్టు కూడా లేదు. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా హిట్టు కొట్టాలనే కసితో డైరెక్టర్ వక్కంతం వంశీతో కలిసి ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్‌ సినిమా చేశాడు.

డిసెంబర్ 8వ తేదీన గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమాలో నితిన్ పక్కన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటించింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిలు నిర్మించారు. శ్రీలీల హీరోయిన్‌గా చేసిన ఈ మూవీలో రాజశేఖర్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించిన అదరగొట్టారు. వీరు మాత్రమే కాకుండా రావు రమేష్, సుదేవ్ నాయర్ తదితరులు నటించారు. హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందించారు.

 Nithin Sreeleela Combo Film Extra Ordinary Man OTT Streaming Detail

కానీ ఈ సినిమా కూడా నితిన్ కు గట్టి దెబ్బే కొట్టింది. ఎవరూ ఊహించని స్థాయిలో ఈ సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది. ముఖ్యంగా సినిమా విడుదల అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ లేకపోవడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ఎవరూ థియేటర్లకు వెళ్లలేదు. ఫలితంగా ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ కూడా ఆశించినట్లుగా దక్కలేదు. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా 24.20 కోట్లు మేర బిజినెస్ చేసుకుందని టాక్ నడుస్తోంది. అలా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదు కాగా.. ఫుల్ రన్‌లో కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇలా 20 కోట్ల రూపాయల నష్టాన్ని మిగుల్చుకున్న ఈ చిత్రం నితిన్ కెరియర్ లో భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.

 Nithin Sreeleela Combo Film Extra Ordinary Man OTT Streaming Detail

అయితే ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈ సినిమాను త్వరలోనే ఓటీటీ వేధికగా విడుదల చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రాన్ని జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారం విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలవడంతో జనవరి మొదటి వారం అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అయితే డేట్ డిసైడ్ చేసిన వెంటనే ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు. చూడాలి మరి ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X