35 OTT: ఓటీటీలో గుండెల్ని పిండే సినిమా.. నివేదా థామస్ మూవీ ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అంటే?

గతంలో కంటే ఈ మధ్య కాలంలో ఫీల్ గుడ్ ఫ్యామిలీ స్టోరీలతో వచ్చే సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో అలాంటి చిత్రాలను ఇష్టపడే వాళ్లు నిరాశ చెందుతున్నారు. ఈ తరుణంలో అప్పుడప్పుడూ కొన్ని గుండెల్ని పిండేసే సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు అలా రూపొంది ఆడియెన్స్ ముందుకు వచ్చిన చిత్రమే '35 చిన్న కథ కాదు'.

టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమానే '35 చిన్న కథ కాదు'. నంద కిశోర్ ఇమానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గణితం అంటే భయపడే పిల్లోడి ఫ్యామిలీలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ సమయంలో ఆ బాలుడి తల్లి ఏం చేసింది? అనే అంశాలతో తెరకెక్కింది. దీంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

Nivetha Thomas Starrer 35 Chinna Katha Kaadu Movie OTT Partner and Streaming Date Details

ఫీల్ గుడ్ ఫ్యామిలీ స్టోరీతో తెరకెక్కిన '35 చిన్న కథ కాదు' సినిమా మంచి అంచనాలను ఏర్పరచుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో ఇది సఫలం అవుతోంది. ఇలా ఈ సినిమా కొన్ని పెద్ద చిత్రాలు ఉన్నా చక్కగా రాణిస్తూ మంచి వసూళ్లను అందుకుంటోంది.

క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన '35 చిన్న కథ కాదు' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ గురించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ మూవీకి మంచి టాక్ రావడంతో చాలా సంస్థలు హక్కుల కోసం పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఓటీటీ హక్కులను ఫేమస్ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. దీన్ని చిత్ర యూనిట్ కూడా రివీల్ చేసింది.

Nivetha Thomas Starrer 35 Chinna Katha Kaadu Movie OTT Partner and Streaming Date Details

'35 చిన్న కథ కాదు' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ గురించి కూడా తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ చిత్రాన్ని థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఆహా సంస్థతో నిర్మాతలు డీల్ చేసుకున్నారట. దీని ప్రకారం.. సెప్టెంబర్ 6న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. అక్టోబర్ రెండో వారంలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉండగా.. '35 చిన్న కథ కాదు' సినిమాలో నివేదా థామస్‌తో పాటు విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దగ్గుబాటి రానా సమర్పణలో సృజన్ ఎరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. ఇందులో అనుదేవ్ పోతుల, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణతేజ, అభయ్ నటించారు. దీనికి వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X