ఓటీటీలోకి మనసుకు హత్తుకునే మంచి సినిమా.. మీ కథను గుర్తు చేసే దీన్ని ఎక్కడ చూడాలంటే!
ఇప్పుడు మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఇండియాలోని అన్ని సినిమా ఇండస్ట్రీల నుంచి మాస్ లేదా హర్రర్ లేదా ప్రయోగాత్మక చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే మంచి ఫీల్ ఉన్న ఫ్యామిలీ సినిమాల సంఖ్య తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగులో రూపొందిన కుటుంబ కథా చిత్రమే '35 చిన్న కథ కాదు' (35 Chinna Katha Kaadu).
అద్భుతమైన నటి నివేదా థామస్ ప్రధాన పాత్రను పోషించిన సినిమానే '35 చిన్న కథ కాదు'. నంద కిశోర్ ఇమానీ తెరకెక్కించిన ఈ మూవీ మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే భయపడే పిల్లోడి వల్ల వాళ్ల కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి? దీనికోసం మ్యాథ్స్ టీచర్, స్టూడెంట్ మదర్‌తో కలిసి ఏం చేశాడు? అనే అంశాలతో వచ్చింది. దీంతో ఆరభంలోనే బాగా ఫోకస్ అయింది.

నవ్విస్తూ, భావోద్వేగానికి గురి చేస్తూ సాగిపోయే కథతో వచ్చిన '35 చిన్న కథ కాదు' సినిమా మంచి అంచనాలను ఏర్పరచుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రప్పించుకుంది. దీంతో ఆడియెన్స్‌ను థియేటర్లకు తీసుకు రావడంలో ఇది సఫలం అయింది. ఇలా ఈ సినిమా కొన్ని పెద్ద చిత్రాలు ఉన్నా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది.
సందేశాత్మక కథతో తెరకెక్కిన '35 చిన్న కథ కాదు' మూవీకి సంబంధించిన హక్కులకు మంచి పోటీనే వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం చాలా సంస్థలు పోటీలో నిలిచాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఓటీటీ హక్కులను ఫేమస్ సంస్థ ఆహా దక్కించుకుంది. అప్పటి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ గురించి చాలా రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

'35 చిన్న కథ కాదు' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై క్లారిటీ లేకపోవడంతో ఎవరికి తోచింది వాళ్లు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆహా సంస్థ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అంతేకాదు, 'ఈ చిన్న కథలో వెనుక పెద్ద పాఠం ఉంది! మన ఇంటి కథలా అనిపిస్తుంది' అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా చూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. '35 చిన్న కథ కాదు' చిత్రంలో నివేదా థామస్‌తో పాటు విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దగ్గుబాటి రానా సమర్పణలో సృజన్ ఎరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. ఇందులో అనుదేవ్ పోతుల, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణతేజ, అభయ్ నటించారు. దీనికి వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











