ముందుగానే ఓటీటీలోకి మంచి ఫ్యామిలీ మూవీ.. గుండెల్ని పిండేసే దీన్ని ఎలా చూడాలంటే!
తెలుగు సినిమా రంగంలో మంచి ఫ్యామిలీ స్టోరీలతో సినిమాలు ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అలాంటి వాటిలో కొన్ని మాత్రమే ఆరంభంలోనే హైలైట్ అవడంతో పాటు మంచి హైప్ క్రియేట్ చేసుకుంటున్నాయి. అలాంటి సినిమాల్లో విభిన్నమైన కుటుంబ కథతో వచ్చిన '35 చిన్న కథ కాదు' (35 Chinna Katha Kaadu) ఒకటి.
టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్ లీడ్ రోల్‌లో నటించిన సినిమానే '35 చిన్న కథ కాదు'. నంద కిశోర్ ఇమానీ దర్శకత్వం వహించిన ఈ మూవీ మ్యాథ్స్ అంటే భయపడే పిల్లోడి ఫ్యామిలీలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ సమయంలో ఆ కుర్రాడి తల్లి ఏం చేసింది? అనే అంశాలతో తెరకెక్కింది. దీంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టిలో పడిపోయింది.

ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ స్టోరీతో తెరకెక్కిన '35 చిన్న కథ కాదు' సినిమా మంచి అంచనాలను ఏర్పరచుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రప్పించుకుంది. దీంతో ఆడియెన్స్‌ను థియేటర్లకు తీసుకు రావడంలో ఇది సఫలం అయింది. ఇలా ఈ సినిమా కొన్ని పెద్ద చిత్రాలు ఉన్నా చక్కగా రాణిస్తూ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆలోచింపజేసే కథతో తెరకెక్కిన '35 చిన్న కథ కాదు' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ గురించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ మూవీకి మంచి టాక్ రావడంతో చాలా సంస్థలు హక్కుల కోసం పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఓటీటీ హక్కులను ఫేమస్ సంస్థ ఆహా దక్కించుకుంది. దీన్ని చిత్ర యూనిట్ కూడా టైటిల్ కార్డ్స్‌లో రివీల్ చేసేసింది.

'35 చిన్న కథ కాదు' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి కూడా ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దీన్ని సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీని సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారట. దీనిపై ఈ రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతుందని తాజాగా మరో న్యూస్ లీకైంది.
ఇదిలా ఉండగా.. '35 చిన్న కథ కాదు' సినిమాలో నివేదా థామస్‌తో పాటు విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దగ్గుబాటి రానా సమర్పణలో సృజన్ ఎరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. ఇందులో అనుదేవ్ పోతుల, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణతేజ, అభయ్ నటించారు. దీనికి వివేక్ సాగర్ మ్యూజిక్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











