150 కోట్లకి కమల్, మణిరత్నం బిగ్ ప్రాజెక్ట్ ఓటిటి డీల్.. ఏ ఓటిటికి సొంతం అంటే..

ఇండియన్ సినిమా దగ్గర ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో చాలా మంది యువ హీరోలు తమ సత్తా చాటుతున్నారు. కానీ వారి కంటే ముందు ఉన్న సీనియర్ హీరోస్ కూడా ఇప్పటికీ తమ రేంజ్ సినిమాలు తీస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక టైం లో మన సీనియర్ హీరోస్ అంతా తమ ఫామ్ ని కోల్పోయి కనిపించారు. ఇది ఒక్క తెలుగు సినిమాలోనే కాకుండా తమిళ్, హిందీ మార్కెట్ లలో కూడా కనిపించింది.

కాగా మళ్ళీ మన సీనియర్ హీరోలు హిట్ కొడితే ప్రెజెంట్ జెనరేషన్ కి కూడా తెలియాలి అని ఫ్యాన్స్ కోరుకున్నారు. అలా కోరుకున్న ఫ్యాన్స్ లో ఉలగనయగన్ కమల్ హాసన్ ఫ్యాన్స్ కూడా ఒకరు. మరి కమల్ హాసన్ హీరోగా ఆ మధ్య కాలంలో చేసిన అన్ని సినిమాలు ప్లాప్ గానే నిలిచాయి. తన నటనతో యూనివర్సల్ హీరో అనిపించుకున్న తాను ఇలా హిట్ కోసం స్ట్రగుల్ అవ్వడం అనేది మూవీ లవర్స్ కే బాధగా అనిపించింది.

noted ott platform closed ott deal of kamal thug life for whopping 150 crore

కానీ అప్పుడు వచ్చింది "విక్రమ్" అనే మాస్ సినిమా. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేసిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యి ఏకంగా తమిళ నాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకివచ్చిన కమల్ మరిన్ని భారీ సినిమాలు తాను ప్రకటించారు. అయితే వీటిలో తన మరో క్లాసిక్ దర్శకుడు మణిరత్నంతో ఎన్నో ఏళ్ళు తర్వాత అనౌన్స్ చేసిన భారీ చిత్రమే "థగ్ లైఫ్".

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో అన్నట్టు అనౌన్సమెంట్ వీడియోతో ఒక్కసారిగా హైప్ ని పెంచి కమల్ హాసన్ పై భారీ యాక్షన్ సినిమాగా దీనిని ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం తాలూకా ఓటిటి డీల్ పై సినీ వర్గాల్లో స్ట్రాంగ్ రూమర్స్ కొన్ని వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రంకి ఏకంగా 150 కోట్లతో భారీ ఓటిటి డీల్ వచ్చిందట. మరి ఈ డీల్ ని కూడా వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు పాన్ ఇండియా భాషలకి కలిపి పెట్టి కొనేసినట్టుగా తెలుస్తుంది.

noted ott platform closed ott deal of kamal thug life for whopping 150 crore

దీనితో మళ్ళీ కమల్ అలాగే మణిరత్నం కెరీర్ లోనే ఓ సినిమాకి ఇది బిగ్గెస్ట్ ఆఫర్ అని చెప్పాలి. మరి వీరి కలయికలో కల్ట్ క్లాసిక్ హిట్ చిత్రం "నాయకుడు" తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ పడుతుండడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో సినిమా షూటింగ్ ని చేస్తుండగా కమల్ హాసన్ తో పాటుగా శింబు, జయం రవి, అలాగే త్రిష కృష్ణన్ నటిస్తున్నారు.

అలాగే ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మేకర్స్ ఈ ఏడాదిలోనే రిలీజ్ అన్నట్టుగా ప్రకటించారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ చిత్రానికి సరైన స్లాట్ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. సో వచ్చే ఏడాదికే వెళుతుంది అని చెప్పొచ్చు.

More from Filmibeat

Read more about: kamal haasan thug life trisha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X