OTT ప్రియులకు శుభవార్త.. కొత్తవే కాదు అద్భుతమైన పాత చిత్రాలు కూడా ఓటీటీలోకి!
ఓటీటీ.. వీటి వల్ల చాలా మంది సినీ ప్రియులు చక్కగా ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూస్తున్నారు. తమకు నచ్చిన, ఇష్టమైన వాటిని చూస్తూ.. ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతీ వారం, పండుగల సీజన్ లో ఎక్కువ మొత్తంలో వచ్చే సూపర్ డూపర్ హిట్టు చిత్రాలతో పాటు అద్భుతమైన వెబ్ సిరీస్ లను కూడా వీక్షిస్తున్నారు.
అయితే ఎప్పుడూ కొత్త చిత్రాలే కాకుండా గతంలో సూపర్ డూపర్ హిట్లుగా నిలిచిన.. తమకు బాగా ఇష్టమైన చిత్రాలను కూడా చూడాలనుకుంటారు చాలా మంది. అలాంటి వారి కోసమే ఆహా కొన్ని అద్భుతమైన చిత్రాలను ప్రీమియం క్వాలిటీతో అందుబాటులోకి తెస్తోంది.

నవంబర్ మూడు నుంచి మగధీర: ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా వచ్చిన మగధీర సినిమా కూడా ఓటీటీలోకి రాబోతుంది. ఆహా వేదికగా నవంబర్ మూడో తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా వ్యవహిరంచారు.
శ్రీహరి, సునీల్, దేవ్ గిల్, శరత్ బాబు, ఛత్రపతి శేఖర్ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఏ రేంజ్ లో హిట్టుగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇందులోని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచి ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ గా ఉన్నాయి.

నవంబర్ 10 నుంచి అతడు: అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 2005లో వచ్చిన చిత్రం అతడు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. ఓ ట్రెండ్ ను సెట్ చేసింది. త్రిష హీరోయిన్ గా ఈ సినిమాలో ఇరగదీసింది. ఈ చిత్రానికి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంట్ అతిశయోక్తి కాదు.
చాలా మందికి ఈ సినిమా అంటే ఇప్పటికీ పిచ్చి. అందుకే ఈ సినిమాను కూడా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా ప్రీమియం క్వాలిటీతో అందుబాటులోకి తెస్తోంది. నవంబర్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

నవంబర్ 17 నుంచి ఘరానా మొగుడు: కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నగ్మ హీరోయిన్ గా 1992లో వచ్చిన ఘరానా మొగుడు చిత్రం గురించి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మెగాస్టార్ గ్రాఫ్ ను విపరీతంగా పెంచేసింది. ఆకాంలలోనే 10 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి తెలుగు చిత్రంగా నిలిచిన ఘరానా మొగుడు.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. అద్భుతమైన కథతో పాటు అంతకు మించిన పాటలు కల్గిన ఈ చిత్రం నవంబర్ 17వ తేదీ నుంచి ఓటీటీలోకి రాబోతుంది. చూడాలనుకున్న వారు ఆహాలో ఈ సినిమాను చూడవచ్చు.
గతంలో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన అద్భుతమైన చిత్రాలను చూసేందుకు తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా తమ అభిమాన హీరోల చిత్రాలను పదే పదే చూస్తుంటారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆహా సంస్థ అధినేతలు.. ఈ అద్భుతమైన చిత్రాలను ప్రీమియం క్వాలిటీతో అందుబాటులోకి తెస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీకు నచ్చిన సినిమాను ఫుల్ క్లారిటీతో చూసి ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











