OTT movies: ఈ వారం ఓటీటీలో రాబోతున్న బడా సినిమాలు.. నాగ్ డబుల్ ధమాకా!
ఈ వారం కూడా ఓటీటీ లో ఆసక్తికరమైన సినిమాలు రాబోతున్నాయి. థియేటర్లలో పెద్ద సినిమాలు ఏమి రావడం లేదు. ఓ మోస్తరుగా హైప్ క్రియేట్ చేసిన కొన్ని చిన్న సినిమాలు మాత్రమే నవంబర్ 4న థియేట్రికల్ గా విడుదల కానుండగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్న రెండు పాన్ ఇండియా సినిమాలు ఓటీటీ లో రాబోతున్నాయి. ముఖ్యంగా అందులో నాగార్జున ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు.
ముందుగా థియేటర్స్ లో అయితే అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో సినిమా నవంబర్ 4న రానుంది. అలాగే అదే రోజు సంతోష్ శోభన్ లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమాతో పాటు బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమా రానుంది. ఇక బనారా అనే మరో సినిమా కూడా అదే రోజు థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇక ఈ నవంబర్ 4న ఓటీటీ లో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో అక్కినేని నాగార్జున ది ఘోస్ట్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

ఇక నాగార్జున ప్రముఖ పాత్రలో నటించిన మరో హిందీ పాన్ ఇండియా సినిమా బ్రహ్మాస్త్ర కూడా నవంబర్ 4వ తేదీన రానుంది. రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ఈ శుక్రవారం నుంచే స్ట్రీమింగ్ కానుంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఇటీవల భారీ కలెక్షన్స్ అందుకున్న మరో పాన్ ఇండియా సినిమా పొన్నియిన్ సెల్వన్ 1 కూడా ఓటీటీ లో విడుదల కానుంది.


అమెజాన్ ప్రైమ్ వీడియో లో నవంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ హిస్టారికల్ సినిమా కోసం ఓ వర్గం ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలతో పాటు ఓటీటీ లో మరికొన్ని ఆసక్తికరమైన సినిమాలు కూడా రానున్నాయి. నవంబర్ 5వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో బుల్లెట్ ట్రైన్ అనే ఇంగ్లీష్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. జీ 5లో అమ్రాపలి అనే బెంగాలీ సినిమా నవంబర్ 4 నుంచే సందడి చేయనుంది.


Click it and Unblock the Notifications











