NTR Neel OTT Deal: దిమ్మతిరిగే రేంజ్‌లో 'డ్రాగన్' ఓటీటీ డీల్.. ఎన్టీఆర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
NTR Neel OTT Deal: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం 'ఎన్టీఆర్-నీల్' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిమానులు 'NTR31'గా పిలుస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ టోన్, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కలిసి ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో హాట్ ప్రాపర్టీగా మార్చేశాయి. తాజాగా సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ హాట్ టాపిక్ మారింది. ఇంతకీ డాగ్రన్ మూవీ ఓటీటీ డీల్ ఎన్ని కోట్లంటే?
ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, ప్రస్తుతం జోర్డాన్‌లో కీలక యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది. అక్కడ హై-వోల్టేజ్ ఫైట్ సీన్స్‌ను షూటింగ్ చేస్తున్నట్టు సమాచారం. 1970ల నేపథ్యంతో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ మాఫియా లీడర్ పాత్రలో కనిపించనున్నారని టాక్. ఎన్టీఆర్ తాజా లుక్, స్టైలింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది.

ఇదిలా ఉండగా... డ్రాగన్‌కు సంబంధించిన ఓటీటీ డీల్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ (Netflix) దాదాపు రూ. 155 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ సినిమాలకు ఓటీటీ డీల్స్ మందగించిన సమయంలో, ఇంత భారీ మొత్తంలో డీల్ కుదరడం నిజంగా సంచలనమేనని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ మొత్తం సినిమా బడ్జెట్‌లో పెద్ద భాగాన్ని కవర్ చేసే స్థాయిలో ఉందని ట్రేడ్ టాక్.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. థియేట్రికల్ రిలీజ్ అయిన దాదాపు 8 వారాల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా 4 వారాల విండో ఉండగా, డ్రాగన్‌కు డబుల్ టైమ్ ఇవ్వడం ద్వారా మేకర్స్ థియేటర్లపై ఎంత నమ్మకంతో ఉన్నారో అర్థమవుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాలనే స్ట్రాటజీతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
నటీనటుల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ నటుడు టోవినో థామస్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ భారీ మూవీకి రవి బాసృర్ సంగీతం అందిస్తుండగా జూన్ 25, 2026న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకముందే రూ. 155 కోట్ల ఓటీటీ (OTT) డీల్ కుదరడం ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్‌డమ్‌కు, ప్రశాంత్ నీల్ ట్రాక్ రికార్డ్‌కు నిదర్శనమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్-నీల్ కాంబో మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











