OTT ప్రియులకు గుడ్ న్యూస్ - రేపు ఒక్కరోజే 29 సినిమాలు విడుదల, పండగ చేస్కోండి!
అక్టోబర్ 20వ తేదీన ఓటీటీ ప్రియులకు పండగ రోజు అని చెప్పొచ్చు. ఎందుకు అంటారా... ఈ ఒక్కరోజే ఓటీటీల్లోకి మొత్తం 29 సినిమాలు రాబోతున్నాయి. అసలే పండగ సెలవులు, ఆపై అదిరిపోయే చిత్రాలు. థియేటర్లకు వెళ్లి చూడాల్సిన పని కూడా లేకుండా... వీలున్నప్పుడల్లా ఇంట్లోనే కూర్చొని మీకు నచ్చిన సినిమాలు చూసేయొచ్చు. ఏదో ఒకటో, రెండు చిత్రాలు మాత్రమే ఉంటే మీకు బోర్ కొడుతుండొచ్చు కానీ... ఇంత ఎక్కువ చిత్రాలు ఉంటే మాత్రం పండగే. అసలు రేపు రిలీజ్ కాబోయే అన్ని చిత్రాలు ఏంటి, అవి వేటిలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దసరా, బతుకమ్మ పండగలకు ముందే శుక్రవారం పండుగ వాతావారణాన్ని కల్పించబోతున్నారు. ఈ వారం మొత్తం ఓటీటీలో ఏకంగా 40 సినమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో రేపు ఒక్కరోజే 29 చిత్రాలు వస్తుండడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మామా మశ్చీంద్ర, సర్వ శక్తిమయం, కృష్ణారామ తదితర తెలుగు చిత్రాలు రేపు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అందులోనూ మామా మశ్చీంద్ర సినిమా అయితే రెండు ఓటీటీల్లో విడుదవుతోంది. ఓవైపు అమెజాన్ ప్రైమ్ లో మరోవైపు ఆహాలో రేపటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే..!
అమెజాన్ ప్రైమ్..
⦁ మామా మశ్చీంద్ర - తెలుగు సినిమా
⦁ ట్రాన్స్ ఫార్మర్: ద రైజ్ ఆఫ్ ద బీస్ట్స్ - ఇంగ్లీష్ సినిమా
⦁ సయొన్ఛ డిసర్ట్ రోజ్ - ఇంగ్లీష్ సినిమా
⦁ ద అదర్ జోయ్ - ఇంగ్లీష్ సినిమా
⦁ అప్ లోడ్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్
⦁ క్యాంపస్ బీస్ట్ సీజన్ 2- హిందీ సిరీస్
నెట్ ఫ్లిక్స్ లో..
⦁ క్రియేచర్ - టర్కిష్ సిరీస్
⦁ డూనా - కొరియన్ సిరీస్
⦁ ఎలైట్ సీజన్ 7 - స్పానిష్ సిరీస్
⦁ కండాసమ్స్: ద బేబీ - ఇంగ్లీష్ సినిమా
⦁ ఓల్డ్ డాడ్స్ - ఇంగ్లీష్ సినిమా
⦁ పెయిన్ హజ్లర్స్ - ఇంగ్లీష్ సినిమా
⦁ సర్వైవింగ్ ప్యారడై్ - ఇంగ్లీ సిరీస్
⦁ జెరాన్ టోమిక్: లా హోమీ అరైనీ దే పారిట్ - ఫ్రెంచ్ సినిమా
ఆహా..
⦁ మామా మశ్చీంద్ర - తెలుగు సినిమా
⦁ సర్వశక్తిమయం - తెలుగు సినిమా
⦁ రెడ్ శాండల్ వుడ్ - తమిళ సినిమా
డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
⦁ కింగ్ ఆఫ్ కొత్త - హిందీ సినిమా
సోనీ లివ్..
⦁ హామీ 2 - బెంగాలీ సినిమా
బుక్ మై షో
⦁ మై లవ్ పప్పీ - కొరియన్ సినిమా
లయన్స్ గేట్ ప్లే
⦁ మ్యూగీ మూరే - ఇంగ్లీష్ సినిమా
ఆపిల్ ప్లస్ టీవీ
ద పీజియన్ టన్నెల్ - ఇంగ్లీష్ సినిమా


Click it and Unblock the Notifications