OTT ప్రియులూ అలర్ట్ గా ఉండండి.. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు ఇవే!

ఓటీటీ ప్రియులు ఫుల్ ఖుషీ అయ్యేలా.. రోజుకో సినిమా, రోజుకో వెబ్ సిరీస్ అందుబాటులోకి వస్తోంది. ఇటీవలే బతుకమ్మ, దసరా సందర్భంగా మొత్తం 40కు పైగా చిత్రాలు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాగా.. ఈ వారం కూడా కొన్ని చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఎప్పుడూ అవే కాకుండా ఈసారి కొత్తగా చూసేందుకు అందుబాటులోకి నూతన చిత్రాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. మీ పనులు అన్నీ పూర్తి చేసుకొని కొత్తగా వచ్చిన ఓ వెబ్ సిరీసో లేదంటో ఓ సినిమాను మీ కుటుంబ సభ్యులతో కలిసి చూశారంటే ఎంత ఒత్తిడి ఉన్నా మటుమాయం అవుతుంది. అందుకే ఏమేం చిత్రాలు రాబోతున్నాయో చూసి ఏది చూడాలా డిసైడ్ చేసేసుకోండి.

ఈ వారం ముఖ్యంగా కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా వచ్చిన తాజా చిత్రం ఛాంగురే బంగారు రాజా. ఈ సినిమాను మాస్ మహారాజా రవితేజ నిర్మించగా... సతీష్ వర్మ తెరకెక్కించారు. సత్య, రవిబాబు, నిత్యశ్రీ, ఎస్తర్ లు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో థియేటర్లలోకి వచ్చింది. అయితే మిశ్రమ స్పందన అందుకున్న ఈ చిత్రం ఈటీవీ విన్ వేదికగా అక్టోబర్ 27వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతుంది.

October 22nd to 29th More Number of Films And Web Series Going to Release on OTT

అలాగే నయనతార, జయం రవి కాంబోలో వచ్చిన ఇరైవన్ చిత్రం ఈరోజు నుంచే నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్, బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ హీరోహీరోయిన్లుగా వచ్చిన చంద్రముఖి 2 గురించి అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కూడా ఈరోజు నుంచే నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే పెయిన్ హజ్లర్స్ అనే హాలీవుడ్ చిత్రం అక్టోబర్ 27వ తేదీ అంటే రేపటి నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉండబోతుంది.

అమెజాన్ ప్రైమ్
మరో ఆస్పిరెంట్స్ అనే హిందీ సిరీస్ అక్టోబర్ 25వ తేదీ నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఈరోజు నుంచి ట్రాన్స్ ఫార్మార్స్ కూడా అందుబాటులోకి వచ్చింది. కాన్ సిక్రేషన్ అనే హాలీవుడ్ చిత్రం అక్టోబర్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. మరోవైపు కాస్టావే దివా అనే కొరియన్ చిత్రం అక్టోబర్ 28వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతుంది.

ఆహా వేదికగా
కృష్ణగాడు అంటే ఓ రేజ్ అనే తెలుగు సినిమా ఇప్పటికే ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు కేస్ 30, సురాపానం అనే తెలుగు చిత్రాలు రేపటి నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అంతేకాకుండా దూరంగా అనే వెబ్ సిరీస్ అక్టోబర్ 24వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళంతో పాటు తెలుగులో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికాగ మాస్టర్ పీస్ అనే చిత్రం కూడా ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంత మంచి చిత్రాలు, వెబ్ సిరీస్ లను ఏమాత్రం మిస్ చేసుకోకుండా చూసేయండి మరి. ఇంకెందుకు ఆలస్యం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X