OTT ప్రియులు ఇటో లుక్కేయండి.. ఈ వారం స్ట్రీమింగ్ కాబోయే చిత్రాలివే!

ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు... ముఖ్యంగా చిన్న సినిమాలు అయినా సరే మంచి టాక్ వస్తే తప్ప ఎవరూ థియేటర్లకు వెళ్లట్లేదు. చాలా వరకు ఇంట్లోనే కూర్చొని ఓటీటీల వేదికగా సినిమాలను చూస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే ఫుల్ గా ఎంజాయ్ చేసేందుకు చాలా మంది ఇష్ట పడుతున్నారు.

అయితే విజయ దశమి సందర్భంగా చాలానే చిత్రాలు ఓటీటీ వేదికగా విడుదల అయ్యాయి. సరికొత్త వెబ్ సిరీస్ లు కూడా సందడి చేశాయి. అయితే వీలు దొరకినప్పుడు ఓటీటీ ప్రియులు తమకు నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ లను చూసేశారు. ఈక్రమంలోనే కొత్త వాటి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కొత్త వారంలో చాలానే సినిమాలు రాబోతున్నాయి.

October 30th to November 4th More Number of Films And Web Series Going to Release on OTT

ముఖ్యంగా ఆహా వేదికగా ఆర్ యూ ఓకే బేబీ అనే తమిళ చిత్రం అక్టోబర్ 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. లక్ష్మీ రామకృష్ణన్ దర్శకత్వంలో నటుడు, డైరెక్టర్ అయిన సుమద్రఖని, అభిరామి, ముల్లై అరసి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం థియేటర్ల వద్ద మంచి టాకే తెచ్చుకుంది. సెప్టెంబర్ 22వ తేదీన విడుదలై ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. రేపటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాలు చూసి ఎంజాయ్ చేసేయండి.

Skanda Movie To Release In Disney Hotstar on November 2

అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా నవంబర్ రెండో తేదీ నుంచి స్కంద సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా నటించగా.. ఆయన సరసన శ్రీలీల హీరోయిన్ గా చేసింది. సయూ మంజ్రేకర్ కీలక పాత్రలో కనిపించగా... శ్రీకాంత్, ఇంద్రజలు ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. మరి ఓటీటీలో ఏ మేర సందడి చేస్తుందో చూడాలి.

Jawan To Release In Netflix On November 2

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా తాజాగా వచ్చిన చిత్రం జవాన్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. బాక్సాఫీసును కొల్లగొట్టి ఇప్పటి వరకు 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. మెత్తంగా రూ.600 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించింది. సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రం నవంబర్ 2వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. ఇంకెందుకు ఆలస్యం అలా విడుదల కాగానే ఇలా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేయండి. అలాగే లాక్ ఇన్ అనే హాలీవుడ్ సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ వేదికగా నవంబర్ ఒకటో తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

అమెజాన్ ప్రైమ్ వేదికగా పి.ఐ మీనా అనే హిందీ వెబ్ సిరీస్ నవంబర్ మూడో తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. స్కామ్ 2003: పార్ట్-2 హిందీ వెబ్ సిరీస్ కూడా సోనీ లివ్ లో విడుదల కాబోతుంది. ఈ వారం విడుదల కాబోయే ఈ సినిమాలు, వెబ్ సిరీస్ లలో మీకు నచ్చిన వాటిని ఫ్యామిలీతో కలిసి చూడండి. ఫుల్లుగా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X