twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    OTT: ఈ వారం ఓటీటీ లో ఆసక్తికరమైన సినిమాలు.. బింబిసార స్ట్రీమింగ్ ఎందులో అంటే?

    |

    కేవలం సినిమా ధియేటర్లలో మాత్రమే కాకుండా ఇప్పుడు ఓటీటీలో వచ్చే సినిమాలకు కూడా మంచి క్రేజ్ అయితే అందుతుంది. కొంతమంది ఓటీటీ కంటెంట్ కు చాలా అలవాటు పడ్డారు అనే చెప్పాలి. ఈవారం కూడా కొన్ని డిఫరెంట్ సినిమాలు ఓటీడీ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల కాబోతున్నాయి. అయితే అందులో అందరి ఫోకస్ ఎక్కువగా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా పైనే ఉంది. ఇక ఏ సినిమా ఎందులో స్ట్రీమింగ్ కాబోతుంది అనే వివరాల్లోకి వెళితే..

    ఓకే ఒక జీవితం

    ఓకే ఒక జీవితం

    సెప్టెంబరు 9న థియేటర్లలో విడుదలైన శర్వానంద్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అసలు ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ అవుతుందా లేదా అని అనుమానాలు చాలానే వచ్చాయి. కొత్త దర్శకుడు అయినప్పటికీ టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

    ఆమెజాన్ ప్రైమ్ లో..

    ఆమెజాన్ ప్రైమ్ లో..

    ఇక అమెజాన్ ప్రైమ్ లో అయితే వరుసగా మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 19వ తేదీన అమ్ము అనే ఒక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి నవీన్ చంద్ర నటించారు. ఇక బాబీ సింహం మరొక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే అక్టోబర్ 21వ తేదీన పేరి ఫెరల్ అనే సిరీస్ మొదలు కాబోతోంది. అదే రోజు ఫోర్ మోర్ షాట్స్ అనే మరొక సీరిస్ కూడా స్టార్ట్ కాబోతోంది.

    నెట్ ఫ్లిక్స్ కంటెంట్

    నెట్ ఫ్లిక్స్ కంటెంట్

    నెట్ ఫ్లిక్స్ లో అయితే ఏకంగా నాలుగు డిఫరెంట్ సినిమాలో రాబోతున్నాయి. అందులో ఎక్కువగా అయితే అందరి ఫోకస్ కూడా ఈ ది స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్ అనే సినిమా పైనే ఉంది. ఇంగ్లీష్ లో అక్టోబర్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ కూడా మంచి క్రేజ్ అందుకుంది. అలాగే ఇన్ సాల్వ్ మిస్టరీస్ అనే మూడవ వాల్యూమ్ అక్టోబర్ 18 న రానుండగా.. అక్టోబర్ 21 బార్బెరియన్స్ అనే సెకండ్ సీరీస్ సందడి చేయబోతోంది. అదేరోజు ఫ్రం స్క్రాచ్ అనే సిరీస్ కూడా స్టార్ట్ కానుంది.

    బింబిసార ఎప్పుడంటే

    బింబిసార ఎప్పుడంటే

    ఇక జీ5 లో అక్టోబర్ 21 నుంచి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మొత్తానికి అనుకున్నట్లుగానే ఈ వారం బింబిసార ఓటీడీలోకి రాబోతోంది. ఇక అదే రోజు జీ5 లోనే త్రిపులింగ్ అనే ఒక వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కాబోతోంది. మరి ఈ ఓటీటీ కంటెంట్ లలో ఏది ఎక్కువగా క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

    థియేటర్స్ లో రాబోయే సినిమాలు

    థియేటర్స్ లో రాబోయే సినిమాలు

    దీపావళి పండగ సందర్భంగా మొత్తంగా ఈ వారం ఆరు సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి. అక్టోబర్ 20న బ్లాక్ ఆడమ్ సినిమా వస్తుండగా అక్టోబర్ 21వ తేదీన ఓరి దేవుడా అనే సినిమా రాబోతోంది. ఇక మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా అక్టోబర్ 21న విడుదల అవుతోంది. శివ కార్తికేయన్ నటించిన ద్విభాషా చిత్రం ప్రిన్స్ కూడా అక్టోబర్ 21 నుంచి సందడి చేయబోతోంది. అదే రోజు కార్తీ సర్దార్ తో వస్తున్నాడు. ఇక చివరిగా అక్టోబర్ 25న అక్షయ్ కుమార్ నటించిన రామ్ సేతు తెలుగులో విడుదల అవుతోంది.

    English summary
    October diwali festival ott movies release dates and theatrical release details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X