Kill on OTT: ఓటీటీలో కిల్ మూవీ ట్విస్ట్.. ఆ ఒక్క భాషలోనే స్ట్రీమింగ్!

కొన్ని చిత్రాలు చిన్నవే పెద్దగా తెలియని ముఖాలు అయినప్పటికీ కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తాయి. చాలా మంది ఫలానా సినిమా వచ్చింది అని తెలియకుండానే ఆయా ఇండస్ట్రీ లను షేక్ చేసి అదరగొడతాయి. కేవలం ఒక్క ఇండస్ట్రీ మాత్రమేనా.. ఇప్పుడు ఉన్న రోజుల్లో అయితే ఒక సినిమా తాలూకా ఫలితం కోసం టోటల్ పాన్ ఇండియా ఆడియెన్స్ రీజనల్ గా డబ్బింగ్ కాకపోయినప్పటికీ కూడా పాకేస్తున్నాయి.

ఇలా ఇటీవల ఇండియన్ సినిమా ఆడియెన్స్ లో మాట్లాడుకున్న ఏకైక సినిమా ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక పాత్ బ్రేకింగ్ బ్లడ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా "కిల్" అని చెప్పాలి. మొట్టమొదటి సినిమాగా యంగ్ హీరో లక్ష్య రాఘవ్ జుయల్ నటించిన ఈ చిత్రంని దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తెరకెక్కించిన ఈ సినిమా హిందీలో ఒక సర్ప్రైజింగ్ హిట్ అయ్యింది.

official date and streaming partner locked for kill movie ott entry in india

ఒక స్టార్ హీరో కనుక ఈ చిత్రం చేసి ఉంటే డెఫినెట్ గా ఇంపాక్ట్ మరో లెవెల్లో ఉండేది అని చాలా మంది సినిమా చూసిన వాళ్ళు అభిప్రాయ పడ్డారు. కాగా ఈ చిత్రం ఒక్క హిందీ ఆడియెన్స్ లోనే కాకుండా ఏకంగా హాలీవుడ్ ఆడియెన్స్ లో కూడా చాలా ఇంపాక్ట్ కలిగించింది. హాలీవుడ్ యాక్షన్ సినిమాలు "జాన్ విక్" సిరీస్ చేసిన నిర్మాణ సంస్థ 87 లెవెన్ ఎంటర్టైన్మెంట్స్ రీమేక్ చేసేందుకు కొనేసుకున్నారు.

ఆ రేంజ్ లో ఈ చిన్న సినిమా మంచి ఇంపాక్ట్ కలిగించింది. అయితే ఈ చిత్రంని థియేటర్స్ లో చాలా మంది మిస్ అయ్యారు. దీనితో ఓటిటి రిలీజ్ కోసం చూస్తూ వచ్చారు. కాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి మాత్రం కాస్త ఎక్కువ సమయమే తీసుకోవాల్సి వచ్చింది. కానీ మొదటిగా ఈ చిత్ర యూఎస్ ఆడియెన్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కొన్ని వారాల కితం స్ట్రీమింగ్ కి తీసుకురాగా ఇండియన్ ఆడియెన్స్ కి ఎవరు ఎపుడు తీసుకొస్తారు అనేది సస్పెన్స్ గా మారింది.

official date and streaming partner locked for kill movie ott entry in india

కాగా ఇప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ కి ఫైనల్ గా గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ సినిమా ఇండియాలో ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో రివీల్ అయ్యింది. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ డిస్నీ ప్లస్ వాళ్ళు సొంతం చేసుకున్నట్టుగా అనౌన్స్ చేశారు. అలాగే ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు.

సో ఇండియాలో ఎప్పుడప్పుడు చూద్దామా అని చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది బిగ్ అప్డేట్ అని చెప్పాలి. కాకపోతే ఇక్కడ చిన్న డిజప్పాయింట్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాకి కేవలం ఒక్క హిందీలో మాత్రమే వీరు తీసుకొస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. చాలా మంది రీజనల్ గా కూడా చూద్దామని అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి ఒక్క హిందీలో మాత్రమే ఫిక్స్ అయ్యింది. కాగా తెలుగు వెర్షన్ వరకు ఐతే ఈ చిత్రం రీమేక్ చేయనున్నారని టాక్ ఉంది. మరి చూడాలి మిగతా భాషల్లో ఏ స్ట్రీమింగ్ యాప్స్ లో వస్తుంది అనేది.

More from Filmibeat

Read more about: kill ott kill movie lakshya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X