OTT : ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్.. ఏడు భాషల్లో ఒకేసారి, స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎందులో..?
ఆగస్ట్ నెలలో వరుస పండుగల నేపథ్యంలో చిన్నా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. సెప్టెంబర్ వచ్చే నాటికి వాతావరణం డల్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా వర్షాలే.. దీంతో ప్రేక్షకులు థియేటర్‌కు రావడం కష్టంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీ ఇండస్ట్రీకి మంచి ఛాన్స్. ఈ నేపథ్యంలో కొన్ని కొత్త సినిమాలు ఆయా ఓటీటీల్లో స్ట్రీమింగ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. క్రైమ్, థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే వారి కోసం ఓ సినిమా ఓటీటీలోకి రానుంది. దాని వివరాలు చూస్తే..
ఓటీటీలను ఇష్టపడేవారు ఎక్కువగా క్రైమ్, హార్రర్, సస్పెన్స్ , కామెడీ సినిమాలను చూడాలనుకుంటారు. కొరియన్, హాలీవుడ్, నైజీరియన్ సినిమాలు ఆ తరహా కంటెంట్‌కు పెట్టింది పేరు కావడంతో ఈ మూవీస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియాలో క్రైమ్ , సస్పెన్స్ మూవీస్‌కు మలయాళ పరిశ్రమ బాగా ఫేమస్. యదార్థ ఘటనలకు డ్రామాను జోడించి మల్లూవుడ్ అద్భుతంగా సినిమాలు చేస్తుంది. ఆ తర్వాతి స్థానం తమిళ చిత్ర పరిశ్రమదే.

గత రెండేళ్లలో చాలా క్రైమ్ మూవీస్ కోలీవుడ్‌లో తెరకెక్కాయి. ఈ కోవలోకే వస్తుంది గోలీ సోడా. 2014లో గోలీ సోడా విడుదలై ఘన విజయం సాధించడంతో దీనికి సీక్వెల్‌గా 2018లె గోలీ సోడా -2 రిలీజ్ అయ్యింది. అయితే ఈసారి మాత్రం దానిని గోలీ సోడా రైజింగ్‌గా వెబ్ సిరీస్ రూపంలో తీసుకొచ్చారు. ఈ సినిమా ఫస్ట్, సెకండ్ పార్ట్‌లలోని కథ, కొన్ని సంఘటనలతో గోలీ సోడా రైజింగ్ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
విజయ్ మిల్టన్ దర్శకత్వంలో వహించిన గోలీ సోడా చిత్రానికి ఐఎండీబీ 7.7 రేటింగ్.. సెకండ్ పార్ట్‌కి 7 రేటింగ్ ఇచ్చింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. పోలీసులు, గొడవలు, నేరాలు, యువకులు ఓ గ్యాంగ్‌గా ఏర్పడటం వంటి ఎలిమెంట్స్‌ను చూపించారు. ఏది ఎలా జరిగినా సరే మనమంతా కలిసే ఉందాం అంటూ కుర్రాళ్లు చెప్పే సీన్ బాగుంది. ఈ వెబ్ సిరీస్‌లో కిషోర్, శ్రీరామ్, పాండి, మురుగేష్, చేరన్, జాన్ విజయ్, షామ్ , అవంతిక, రమ్య కీలక పాత్రలు పోషించారు.
తాజాగా ఈ గోలీ సోడా రైజింగ్ వెబ్‌సిరీస్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ వంటి మొత్తం ఏడురు భాషల్లో గోలీ సోడా రైజింగ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాలు ఆల్రెడీ హిట్ కావడంతో తాజా వెబ్ సిరీస్‌కు కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం సెప్టెంబర్ 13న సినిమా ఎలా ఉందో చూసి కామెంట్ చేసేయండి మరి.


Click it and Unblock the Notifications











