OTT: ఓటిటిలో "కమిటీ కుర్రోళ్ళు" వచ్చేస్తున్నారు.. ఎప్పుడు ఎందులో అంటే..
ఈ ఏడాదికి మన తెలుగు సినిమా దగ్గర ప్రథమార్ధం మరీ అంత సూపర్ అని చెప్పలేం కానీ కొన్ని సినిమాలతో పర్వాలేదు అనిపించింది. కానీ జూన్ నెల నుంచి మాత్రం మళ్ళీ మొత్తం పుంజుకుంది. రెబల్ స్టార్ సెన్సేషనల్ ప్రాజెక్ట్, "కల్కి 2898 ఎడి" వచ్చి రికార్డు వసూళ్లు కొల్లగొట్టింది. అయితే ఈ సినిమా తర్వాత కొన్ని డబ్బింగ్ అండ్ మిడ్ రేంజ్ కంటే పెద్ద సినిమాలు కూడా వచ్చాయి కానీ అవి ఏమాత్రం రాణించలేదు.
కాగా ఈ సమయంలో కొన్ని చిన్న సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర సర్ప్రైజింగ్ హిట్ అయ్యాయి. వాటిలో మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణం వహించి ఎంతో నమ్మకంగా రిలీజ్ కి తీసుకొచ్చిన సూపర్ హిట్ చిత్రం "కమిటీ కుర్రోళ్లు" కూడా ఒకటి. పూర్తిగా కొత్త నటీనటులతో దర్శకుడు యదు వంశీ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం భారీ హిట్ అయ్యింది.

ఈ సినిమా తర్వాత దీనికంటే పెద్ద సినిమాలే వచ్చినప్పటికీ వాటిని తట్టుకొని మరీ ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయ్యి అదరగొట్టింది. అంతే కాకుండా మూడో వారంలో కూడా డీసెంట్ వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం యువతికి ఎంతగానో కనెక్ట్ అయ్యిపోయింది. మళ్ళీ పాత రోజుల్లోకి తీసుకెళ్ళిపోయిన ఈ చిత్రం మన తెలుగు సినిమాలో యూత్ కి బాగా బాగా నచ్చిన కొన్ని క్లాసిక్ హిట్స్ లో ఒకటిగా నిలిచిపోయింది అని చెప్పడంలో డౌట్ లేదు.
అయితే చిన్న సినిమాగా వచ్చి ఇంత పెద్ద హిట్ అయ్యిన ఈ సినిమా ఓటిటికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కానీ పార్ట్నర్ కి సంబంధించి డీటెయిల్స్ గాని రిలీజ్ తో ఇప్పుడు అఫీషియల్ గా బయటకి వచ్చేసింది. కాగా ఈ సినిమాని మన తెలుగులో ఉన్నటువంటి స్ట్రీమింగ్ యాప్స్ లో ఒకరైన ఈటీవీ విన్ వాళ్ళు కొనేశారు. కాగా దీనిపై హింట్ ఇస్తూ ఇవాళ మా ఆఫిస్ దగ్గరకి 11 మంది కుర్రాళ్ళు వచ్చారు అంటూ పోస్ట్ చేశారు.
సో ఇది ఎందుకో అందరికీ అర్ధం అయ్యిపోయింది. దీనితో కమిటీ కుర్రోళ్ళు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి రానుంది. అయితే ఎప్పుడు నుంచి అనేది చూస్తే ఈ సినిమా కూడా నెలలోపే స్ట్రీమింగ్ కి వచ్చేస్తుందట. పండగ వాతావరణం.. పండగ నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా.. సో ఈ వినాయక చవితి కానుకగా ఈ సినిమా సెప్టెంబర్ 7 నుంచి అందుబాటులో ఉంటుంది అని ఇప్పుడు సమాచారం.

థియేటర్స్ లో ఎంతగానో ఎంజాయ్ చేసిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ఓటిటి ఆడియెన్స్ ని అలరించేందుకు రాబోతుంది అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక, షణ్ముఖి నాగుమంత్రి, ఇంకా సాయి కుమార్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించారు.


Click it and Unblock the Notifications











