Maharaja on OTT: ఓటిటిలోకి మహారాజ.. విజయ్ సేతుపతి మూవీ పాన్ ఇండియా రిలీజ్ ఎప్పుడంటే?

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర ప్రథమార్థం అంతా కాస్త డల్ గానే సాగింది అని చెప్పాలి. జనవరి, ఫిబ్రవరి దాదాపు మార్చ్ స్టార్టింగ్ వరకే కొంచెం నోటెడ్ సినిమాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అంతా చాలా డల్ గా సాగింది. అయితే ఇలా మళ్ళీ చాలా కాలం తర్వాత నడవడంతో ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా టోటల్ ఇండియన్ సినిమా దగ్గరే థియేటర్స్ లో సరైన సినిమాలు లేవు చూసేందుకు ఆడియెన్స్ కూడా రాలేదు.

అయితే సరిగ్గా జూన్ మధ్యలో వచ్చాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన "మహారాజ" సినిమాతో అటు తమిళ్ లోనే కాకుండా ఇటు తెలుగులో కూడా ఆడియెన్స్ ని థియేటర్స్ లోకి రప్పించి చాలా రోజుల తర్వాత థియేటర్స్ లోకి క్రౌడ్ ఫుల్ ని చేసిన హీరోగా నిలిచాడు. మరి ఇలా ఈ చిత్రం తన కెరీర్ లోనే భారీ హిట్ అయ్యింది.

official release date of vijay sethupati maharaja is out now

అది కూడా తాను హీరోగా నటించింది అందులోని తన కెరీర్ 50వ సినిమాగా వచ్చి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. కాగా గత కొన్ని రోజులు నుంచి అయితే మహారాజ ఓటిటి రిలీజ్ కోసం ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా జూలై 19 అంటూ ఓ డేట్ ని వినిపించింది కానీ దానికంటే ఓ వారం ముందే సినిమా వచ్చేస్తుంది అని కూడా ఇంకో వచ్చింది.

మరి ఇప్పుడు ఈ టాక్ నిజం చేస్తూ ఈ సినిమా జూలై 12నే ఓటిటి ఎంట్రీ ఇస్తున్నట్టుగా దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసేసింది. కాగా దీనితో పాటుగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ జూలై 12న సినిమా అయితే తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కి రానుంది.

official release date of vijay sethupati maharaja is out now

మరి ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూసే అని చెప్పాలి. కాగా ఈ చిత్రానికి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించగా ఈ చిత్రాన్ని తాను ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో అద్భుతమైన ఎమోషన్స్ మరియు ట్విస్ట్ లు ఇంకా క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లతో తాను తెరకెక్కించి విజయ్ సేతుపతికి ఒక పర్ఫెక్ట్ 50వ సినిమాని అందించాడు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించాడు. అలాగే మమతా మోహన్ దాస్ తదితరులు నటించగా, కాంతారా, విరూపాక్ష, మంగళవారం సంగీత దర్శకుడు అజనీస్ లోక్ నాథ్ సంగీతం అందించాడు. అలాగే ఈ ఇంట్రెస్టింగ్ చిత్రానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తానని నిథిలన్ ఆ మధ్య ఇంట్రెస్టింగ్ లీడ్ కూడా ఒకటి వదిలాడు. మరి అదెలా ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X