OG On OTT: ఓటీటీలో ఓజీ సునామీ.. గ్లోబల్‌గా పవన్ కల్యాణ్‌ మూవీ రికార్డు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో వచ్చిన ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లను రాబడుతున్నది. నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించి ఈ సినిమా రిలీజ్‌కు ఒక నెల ముందే రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ సాధించింది. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ నటించిన ఈ మూవీ విడుదల తర్వాత అదే జోష్‌ను నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో కొనసాగిస్తున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా ఓవర్సీస్‌లో సంచలన రికార్డు క్రియేట్ చేసింది.ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

OG చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తించారు. అయితే థియేట్రికల్ రన్‌లో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అయితే ఓటీటీలో కూడా ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా రికార్డు వ్యూస్ సాధిస్తున్నది. ఈ రికార్డు, ట్రెండింగ్ క్రియేట్ చేస్తున్న ఓజీ మూవీ గురించిన వివరాల్లోకి వెళితే..

OG Rampage on Netflix

థియేట్రికల్ రన్ ముగించుకొన్న ఓజీ చిత్రం ఓటీటీలో సంచలనం రేపుతున్నది. ఈ సినిమా గత రెండు వారాల్లో భారీగా, రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తున్నది. ఈ చిత్రం నేషనల్ వైడ్‌గానే కాకుండా ఇంటర్నేషన్ స్థాయిలో ట్రెండింగ్ అవుతున్నది. ఈ మూవీ పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే ఏ సినిమా సాధించని విధంగా ఓటీటీలో రెస్పాన్స్ అందుకొంటున్నది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమా తొలివారం నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపింది. మొదటి వారం ఈ మూవీ 3.2 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతేకాకుండా ఈ సినిమా 11 దేశాల్లో టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. గ్లోబల్‌గా నాన్ ఇంగ్లీష్ మూవీస్ కేటగిరీలో టాప్ 5 స్థానాన్ని సొంతం చేసుకొన్నది అని చిత్ర యూనిట్ వెల్లడించింది

సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండో వారంలో కూడా రేర్ రికార్డును సొంతం చేసుకొన్నది.ఈ చిత్ర రెండో వారంలో అంటే అక్టోబర్ 27వ తేదీ నుంచి 2 నవంబర్ వరకు 2.1 మిలియన్ వ్యూస్ సాధించింది. 10 దేశాల్లో ఈ చిత్రం టాప్ 10 స్థానంలో నిలిచింది. నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో ప్రపంచవ్యాప్తంగా టాప్ 7 స్థానంలో కొనసాగింది అని చిత్ర యూనిట్ తెలిపింది.

More from Filmibeat

Read more about: og pawan kalyan netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X