ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్.. పొట్టచెక్కలయ్యేలా నవ్వించే మూవీ వచ్చేసింది
టాలీవుడ్‌లో ఇప్పుడు కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి వాటికే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కూడా అవుతున్నారు. ఫలితంగా భారీ రెస్పాన్స్‌ను అందించి.. సూపర్ డూపర్ హిట్లుగా మారుస్తున్నారు. ఇలా ఇటీవలి కాలంలో ఎన్నో మూవీలు వచ్చాయి. అందులో భారీ అంచనాలను ఏర్పరచుకుని విడుదలైన సినిమానే 'ఓం భీమ్ బుష్'.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు హీరోగా శ్రీ హర్ష తెరకెక్కించిన చిత్రమే 'ఓం భీమ్ బుష్'. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీంతో ఈ సినిమాపై ఆరంభంలోనే ఓ రేంజ్‌లో హైప్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే దీన్ని మార్చి 22వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసేశారు.

శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలతో రూపొందిన 'ఓం భీమ్ బుష్' మూవీకి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలో లభించింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఇలా ఈ మూవీ ఫుల్ రన్‌లో హిట్ స్టేటస్‌ను అందుకుని బయ్యర్లకు లాభాలను కూడా తెచ్చి పెట్టింది.
ఫుల్ లెంగ్త్ కామెడీతో రూపొందిన 'ఓం భీమ్ బుష్' సినిమాపై అంచనాలు ఉండడంతో దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు మంచి డిమాండ్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో తీవ్ర పోటీ నడుమ వాటిని అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ హక్కుల కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్నే చెల్లించినట్లు తెలిసింది. ఇక, తాజాగా అమెజాన్ సర్‌ప్రైజ్ చేసేసింది.

'ఓ భీమ్ బుష్' సినిమాను థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాతనే స్ట్రీమింగ్ చేస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ, ఇటీవలే అమెజాన్ ప్రైమ్ సంస్థ దీన్ని ఏప్రిల్ 12 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. అందుకు తగ్గట్లుగానే నేటి అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చింది. దీంతో థియేటర్లలో మిస్ అయిన వాళ్లంతా తెగ ఎగబడుతున్నారు.
ఇదిలా ఉండగా.. డిఫరెంట్ కామెడీ కాన్సెప్టుతో రూపొందిన 'ఓం భీమ్ బుష్' సినిమాను వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఇందులో ప్రీతి ముకుంద్, ప్రియ వడ్లమాని, కామాక్షి భాస్కర్ల, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సన్నీ ఎమ్ఆర్ సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











