Om Bheem Bush: ముందే లీకైన ఓం భీమ్ బుష్ ఓటీటీ వివరాలు.. ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే చాలా మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేశారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయ్ శ్రీ విష్ణు ఒకడు. చాలా కాలం ఫ్లాపులతో ఇబ్బంది పడ్డ అతడు.. గత ఏడాది 'సామజవరగమన'తో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను కొట్టిన సంగతి తెలిసిందే.
క్రేజీ హిట్‌తో ఫామ్‌లోకి వచ్చేసిన శ్రీ విష్ణు ఇప్పుడు 'ఓం భీమ్ బుష్' అనే సినిమాను చేశాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని శ్రీ హర్ష కనుగంటి తెరకెక్కించాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ ప్లాన్ చేసేశారు.

శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబినేషన్‌లో రూపొందిన 'ఓం భీమ్ బుష్' మూవీకి సంబంధించి ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్స్‌తో పాటు మిగిలిన ప్రాంతాల్లో షోలు పడిపోయాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ షోలు వేశారు. దీనికి ఏరియాల్లోనూ దీనికి డీసెంట్ మౌత్ టాక్ వచ్చింది. మరికొద్దిసేపట్లోనే రివ్యూలు కూడా రాబోతున్నాయి.
'ఓం భీమ్ బుష్' సినిమా సందడి ఇప్పటికే థియేటర్లలో మొదలైపోగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చేశాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్నే చెల్లించినట్లు తెలిసింది.

టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటించిన 'ఓ భీమ్ బుష్' సినిమాను థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ లీకైంది. అంటే మార్చి 22వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఏప్రిల్ చివరి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. క్రేజీ కామెడీతో రూపొందిన 'ఓం భీమ్ బుష్' సినిమాను వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఇందులో ప్రీతి ముకుంద్, ప్రియ వడ్లమాని, కామాక్షి భాస్కర్ల, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సన్నీ ఎమ్ఆర్ సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











