OMG 2 on OTT 27 కట్స్ లేకుండా ఓటీటీలోకి... ఆ సీన్లతోనే స్ట్రీమింగ్.. ఓ మై గాడ్ 2 రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 2012లో భారీ విజయం సాధించిన OMG (Oh My God) మూవీ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చిత్రం OMG 2 (Oh My God 2). అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, యామీ గౌతమ్, పంకజ్ త్రిపాఠి, అరుణ్ గోవిల్ తదితరులు నటించారు. విపుల్ షా నిర్మాతగా కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా థియేట్రికల్ జర్నీని ముగించుకొని ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్దమైంది. అయితే ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన వెర్షన్, రిలీజ్ డేట్ గురించిన వివరాల్లోకి వెళితే..
OMG 2 (Oh My God 2) సినిమా రిలీజ్‌కు ముందు అనేక వివాదాల్లో కూరుకుపోయింది. ఈ సినిమా విడుదలను ఆపి వేయాలని పలు వర్గాలు డిమాండ్ చేశాయి. అయితే ఓ పక్క వివాదాలు కొనసాగుతుండగా.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ సర్టిఫికెట్ అధికారులు ఈ సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి దాదాపు 27 కట్స్‌తో ఏ సర్టిఫికెట్ మంజూరు చేశారు.

శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించిన OMG 2 (Oh My God 2) ఆగస్టు 11 తేదిన థియేట్రికల్ రిలీజ్ జరిగింది. సెక్స్ ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్‌తో పెద్దలకు మాత్రమే అనే కండిషన్‌తో థియేటర్లలో ప్రదర్శించారు. అక్షయ్ కుమార్ గత 12 ఏళ్ల కెరీర్‌లో ఏ సర్టిఫికెట్ రావడం ఇదే తొలిసారి అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

భావితరాలకు కొన్ని విషయాలపై అవగాహన కల్పించడానికి OMG 2 (Oh My God 2) సినిమాను తీశాం. ప్రతీ ఒక్కరు ఈ సినిమాను చూడాలన్నదే మా అభిప్రాయం. అయితే U/A సర్టిఫికెట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాం. కానీ మా అభ్యర్థనను సెన్సార్ బోర్డు అర్ధం చేసుకోలేదు. 27 కట్స్, A సర్టిఫికెట్‌తో రిలీజ్ చేశాం అని దర్శకుడు అమిత్ రాయ్ తెలిపారు.

అయితే ఓటీటీలో OMG 2 (Oh My God 2) సినిమాను ఎలాంటి కట్స్ లేకుండా మేము ఏదైతే మూవీని ప్రేక్షకులకు చూపించాలని భావించామో దానినే చూపించడానికి ప్లాన్ చేశాం. ఎలాంటి కట్ లేకుండా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఫ్యామిలీ అంతా ఎలాంటి భయం లేకుండా కంటెంట్‌ను ఎంజాయ్ చేయవచ్చు అని అమిత్ రాయ్ చెప్పారు.
బాలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో జరిగిన ఒప్పందం ప్రకారం.. ఓటీటీలో OMG 2 (Oh My God 2) మూవీ రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమా సెప్టెంబర్ 29వ తేదీన గానీ.. లేదా సెప్టెంబర్ 30వ తేదీన గానీ ఓటీటీలో రిలీజ్ కానున్నది. ఈ సినిమా జియో సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్నది.

OMG 2 (Oh My God 2) చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గత 20 రోజుల్లో ఈ చిత్రం 196 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం కొద్ది రోజుల్లో 200 కోట్ల క్లబ్‌లో చేరనున్నది. ఇండియాలో 150 కోట్లు, ఓవర్సీస్‌లో 33 కోట్ల రూపాయలు రాబట్టింది.


Click it and Unblock the Notifications











