ఏడాది తర్వాత OTTలోకి సూపర్ హిట్ లవ్ స్టోరీ.. అందరికీ కనెక్టయ్యే ఈ మూవీని ఎలా చూడాలంటే?
ఓటీటీల్లో సినిమాలు చూసే వారి సంఖ్య పెరుగుతున్నా కొద్దీ పాత సినిమాలను కూడా ఓటీటీలోకి తీసుకు వస్తూ తెగ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీ ప్రియులు సినిమా బాగుందని తెలిస్తే చాలు.. ఏ భాషలో వచ్చినా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూసేస్తున్నారు. ఆ విషయం అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతల పాత చిత్రాలను అందుబాటులోకి తేవడంతో పాటు అన్ని భాషల్లోనూ డబ్ చేసి మరీ ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ఏడాది క్రితం విడుదల అయిన ఈ క్రేజీ లవ్ స్టోరీ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ చూడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మల్లేశం సినిమాను తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ కొట్టిన సక్సెస్ ఫుల డైరెక్టర్ రాజ్ రాచకొండ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన దర్శకత్వంలో ఏడాది క్రితం బాలీవుడ్ లో ఓ క్రేజీ మూవీ వచ్చింది. ఆ సినిమా పేరే "8 A.M. మెట్రో". ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్ హీరోహీరోయిన్లుగా నటించి మెప్పించారు. అలాగే కల్పిక గణేష్, ఉమేష్ కమత్, నైమిషా నాయర్, ధీర్ చరమ్ శ్రీవాత్సవ్, రాజీవ్ కుమార్, జై ఝా, మధు స్వామీనాథ్, సౌరభ్ దీక్షిత్ లు ప్రధాన పాత్రల్లో నటించారు.

రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మార్క్ కే రాబిన్ సంగీతం అందిచగా.. స్టూడియోస్ 99 బ్యానర్ పై నిర్మించారు. గతేడాది మే 19వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. మెట్రోలో అనుకోకుండా కలుసుకున్న ఓ జంట.. ఒకరికి తెలియకుండా ఒకరు.. వాళ్ల గురించి తెలుసుకుంటారు. అలా చివరకు వీరి ప్రేమ ఇద్దరికీ తెలిసిందా, కలిసిపోయారా లేదా అనేది ఈ సినిమా కథ. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది.
8 A.M మెట్రో అనే సినిమా థియేటర్లలో విడుదల అయిన ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తుందనడంతో అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా రాజ్ రాచకొండ డైరెక్షన్ లో వచ్చింది కాబట్టి కచ్చితంగా చూడాలనుకుంటున్నారు. అయితే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5 వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. మే 10వ తేదీ నుంచి ఈ సినిమా జీ5లో అందుబాటులో ఉండబోతున్నట్లు జీ5 సంస్థే ఎక్స్ వేదికగా ప్రకటించింది. మీరు కూడా ఈ క్రేజీ మూవీని ఓటీటీ వేదికగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్.


Click it and Unblock the Notifications











