ఓటీటీలోనే వచ్చేస్తున్న హర్రర్ మూవీ.. ఎప్పటి నుంచి, ఎందులో చూడాలంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కాన్సెప్టుల్లో సినిమాలు రూపొందుతోన్నాయి. అందులో హర్రర్ జోనర్‌లో ఎక్కువగా చిత్రాలు వస్తున్నాయి. వాటికి అన్ని వర్గాల ప్రేక్షకులు భారీగా మద్దతు ఇస్తుండడంతో ఆ తరహాలో మరిన్ని రూపొందుతోన్నాయి. ఇలా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో క్రేజీ సబ్జెక్టు సినిమానే 'ఊరు పేరు భైరవకోన'.

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో వీఐ ఆనంద్ తెరకెక్కించిన సినిమానే 'ఊరు పేరు భైరవకోన'. క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన ఈ మూవీ విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా భారీ హైప్‌తో ఫిబ్రవరి 16 విడుదల అయింది. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో సందీప్ కిషన్ మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

Ooru Peru Bhairavakona Digital Streaming Date Locked

సందీప్ కిషన్ - వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో హర్రర్ సబ్జెక్టుతో రూపొందిన 'ఊరు పేరు భైరవకోన' మూవీ థియేటర్లలోకి వచ్చిన రెండు వారాల వరకూ మంచి ప్రదర్శననే చేసింది. ఫలితంగా ఈ చిత్రం పది కోట్లు రూపాయల వరకూ షేర్‌తో పాటు 23 కోట్లు రూపాయల గ్రాస్‌ను వసూలు చేసింది. కానీ, టార్గెట్‌కు కాస్త దూరంలోనే ఆగిపోయి ఏబో ఏవరేజ్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చు.

'ఊరు పేరు భైరవకోన' సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సంస్థ కొనుగోలు చేసిందట. ఇందుకోసం భారీ మొత్తాన్నే ముట్టజెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాతనే ఇది ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ గురించి ఓ అదిరిపోయే న్యూస్ లీకైంది.

Ooru Peru Bhairavakona Digital Streaming Date Locked

హర్రర్ కాన్సెప్టుతో తెరకెక్కిన 'ఊరు పేరు భైరవకోన' మూవీని మార్చి 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం మార్చి 8వ తేదీ నుంచే ఓటీటీలోకి రాబోతుందట. దీనిపై అధికారిక ప్రకటనను జీ5 సంస్థ ఈ రెండు రోజుల్లోనే వదలబోతుందని కూడా అంటున్నారు. అదే జరిగితే ఓటీటీ ప్రియులకు పండగే అనొచ్చు.

ఇదిలా ఉండగా.. సందీప్ కిషన్ హీరోగా నటించిన 'ఊరు పేరు భైరవకోన' మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా చేశారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల కిశోర్, హర్ష, రవి శంకర్ కీలక పాత్రలను పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X