నెల కాకుండానే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ.. ఎందులో చూడాలంటే!

మిగిలిన జోనర్లతో పోల్చుకుంటే హర్రర్ మూవీలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంటుంది. అందులోనూ ఈ మధ్య కాలంలో వస్తున్న డిఫరెంట్ కాన్సెప్టుల సినిమాలు మంచి ఆదరణను అందుకుంటున్నాయి. దీంతో మరిన్ని కొత్త ప్రయోగాత్మక చిత్రాలు రూపొందుతోన్నాయి. అలా ఇటీవలే ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు వచ్చిన చిత్రమే 'ఊరు పేరు భైరవకోన'.

టాలెంటెడ్ గాయ్ సందీప్ కిషన్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ తెరకెక్కించిన సినిమానే 'ఊరు పేరు భైరవకోన'. హర్రర్ కాన్సెప్టుతో రూపొందిన ఈ మూవీ విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా భారీ బజ్‌తో ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అయింది. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో మంచి ఓపెనింగ్స్ కూడా లభించాయి.

Ooru Peru Bhairavakona Digital Streaming Started On Amazon Prime

సందీప్ కిషన్ - వీఐ ఆనంద్ కలిసి హర్రర్ సబ్జెక్టుతో చేసిన 'ఊరు పేరు భైరవకోన' మూవీ థియేటర్లలోకి వచ్చిన రెండు వారాల వరకూ మంచి రన్‌నే కొనసాగించింది. ఫలితంగా ఈ చిత్రం పది కోట్లు రూపాయల వరకూ షేర్‌తో పాటు 23 కోట్లు రూపాయల గ్రాస్‌ను కలెక్ట్ చేసుకుంది. కానీ, టార్గెట్‌కు కాస్త దూరంలోనే ఆగిపోయి సెమీ హిట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

భయపెట్టే కథతో వచ్చిన 'ఊరు పేరు భైరవకోన' సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం భారీ మొత్తాన్నే ముట్టజెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాతనే ఇది ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అమెజాన్ అందరినీ సర్‌ప్రైజ్ చేసింది.

Ooru Peru Bhairavakona Digital Streaming Started On Amazon Prime

హర్రర్ సబ్జెక్టుతో రూపొందిన 'ఊరు పేరు భైరవకోన' మూవీని మార్చి 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ నేటి అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి తెచ్చేసింది. దీంతో ఈ చిత్రాన్ని చూసేందుకు సినీ ప్రియులు ఎగబడుతున్నారు. ఫలితంగా అమెజాన్‌లో సందీప్ మూవీకి మంచి స్పందన లభిస్తోంది.

ఇదిలా ఉండగా.. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన 'ఊరు పేరు భైరవకోన' మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా చేశారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల కిశోర్, హర్ష, రవి శంకర్ కీలక పాత్రల్లో కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X