Operation Valentine: ఆ ఓటీటీలోనే వరుణ్ తేజ్ మూవీ.. అన్ని రోజులకే స్ట్రీమింగ్!

పేరుకు మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే అయినా.. తనదైన టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. దీనికితోడు సరైన కథల ఎంపికతో కెరీర్‌లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు. అయితే, గత రెండు చిత్రాలు మాత్రం అతడికి నిరాశనే మిగిల్చాయి. దీంతో ఇప్పుడు 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ చేశాడు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఎయిర్‌ఫోర్స్ బ్యాగ్రౌండ్ మూవీనే 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ సినిమా ఓ టెర్రరిస్ట్ దాడి తర్వాత భారత వైమానిక దళం చేసిన సర్జికల్ స్ట్రయిక్ నేపథ్యంతో తెరకెక్కింది. ఇందులో ఓ సాహసోపేత ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా వరుణ్ తేజ్ నటించాడు. దీంతో దీనిపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి.

Operation Valentine Movie OTT Streaming Details Revealed

ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి గత రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. మరి ఇదే కంటిన్యూ అవుతుందో లేదో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ ఓటీటీ వివరాలు లీకయ్యాయి.

'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా సందడి ఇప్పటికే థియేటర్లలో మొదలైపోగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు కూడా తెలిసింది.

Operation Valentine Movie OTT Streaming Details Revealed

వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అమెజాన్ ప్రైమ్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అంటే మార్చి 1వ తేదీన విడుదలైన 'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రం ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉండగా.. దేశ భక్తిని రగిలించే స్టోరీతో రూపొందిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా.. రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలను చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X