Oppenheimer మూవీని OTT లో చూడాలని అనుకొంటున్నారా? ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అంటే?
అణుబాంబు సృష్టికర్త ఒప్సెన్‌హైమర్ జీవిత కథ ఆధారంగా రూపొందిన బయోగ్రాఫికల్ మూవీ ఒప్పెన్‌హైమర్. హిరోషిమా, నగాసకి నగరాలపై అణుబాంబు దాడి అనంతరం నెలకొన్న పరిస్థితులు, అమెరికాలో రాజకీయాలు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకుల మధ్య జరిగిన కోల్డ్ వార్ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది. జూలై 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఎంత కలెక్ట్ చేసింది? ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనే వివరాల్లోకి వెళితే...
ఒప్పెన్‌హైమర్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో దర్శక, నిర్మాత క్రిస్టఫర్ నోలన్ రూపొందించారు. రాబర్ట్ డౌనీ జూనియర్, సిలియన్ మర్ఫి లాంటి అగ్ర నటులతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను దాదాపు 100 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 820 కోట్ల రూపాయలతో నిర్మించారు.

ఒప్పెన్‌హైమర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఇండియాలో 150 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 3200 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక నార్త్ అమెరికాతో కలిపి ఈ సినిమా 5390 కోట్ల రూపాయలు రాబట్టింది. హాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఇక ఒప్పెన్‌హైమర్ సినిమా డిజిటల్ రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావాలంటే కనీసం మూడు నెలల వ్యవధి ఉండాలి. థియేట్రికల్ రిలీజ్ నాటి నుంచి మూడు నెలల తర్వాత ఓటీటీ రిలీజ్ చేయాలని ఒప్పందం ప్రకారం.. ఈ సినిమా నవంబర్ చివరి మాసంలో ఓటీటీలో రిలీజ్ కానున్నది.
ఇదిలా ఉండగా, ఒప్పెన్‌హైమర్ సినిమా ఓటీటీ రైట్స్ హక్కులకు భారీ ధర పలికింది. ఈ సినిమా హక్కులను ఫ్యాన్సీ రేటు చెల్లించి అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకొన్నది. ఈ సినిమా అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో భారీగా రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











