ఓటీటీని షేక్ చేస్తున్న టాప్ 10 వెబ్ సిరీస్‌లు ఇవే.. దూత చివరి స్థానంలో, వన్‌లో ఏముందంటే?

ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ గురించి అందిరకీ తెలిసిందే. ఈ సంస్థ ఎప్పటికప్పుడు దేశ వ్యాప్తంగా సినీ తారలు, సినిమాలు, వాటి ఫలితాల గురించి సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. కేవలం సినిమాలో కాకుండా ఓటీటీలు, థియేటర్లలో సందడి చేసే సినిమాల గురించి కూడా సర్వేలు చేస్తూ ఫలితాలు వెల్లడిస్తుంది. అయితే తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ చేసిన ఓ సర్వేలో.. ఓటీటీని షేక్ చేస్తున్న టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టును విడుదల చేసింది. అందులో చివరి స్థానంలో నాగ చైతన్య హీరోగా చేసిన దూత వెబ్ సిరీస్ ఉండగా... టాప్ 1లో ఏది ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 1లో.. ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ నిలిచింది. అయితే మొత్తం ఏడు ఎపిసోడ్ లు కల్గిన ఈ వెబ్ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా జనవరి 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా.. చాలా మంది ఆసక్తిగా ఈ వెబ్ సిరీస్ ను చూస్తున్నారు. ఇక టాప్ 2లో ఎప్పటి లాగే కిల్లర్ సూప్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. ఇది నెట్ ఫ్లిక్స్ వేధికగా జనవరి 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మనోజే బాజ్ పాయ్, కొంకణా సేన్ శర్మ కీలక పాత్రలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ పై కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది.

Ormax Media Company Has Released Top 10 OTT Originals in India Based on Buzz

ఇక టాప్ 3లో కర్మ కాలింగ్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. ఈ వెబ్ సిరీస్ డిస్నే ప్లస్ హాట్ స్టార్ వేధికగా స్ట్రీమింగ్ అవుతోంది. పగను తీర్చుకునే నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ జనవరి 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా.. చాలా మంది తెగ్ ఆక్తిగా చూస్తున్నారు. అలాగే టాప్ 4లో బెర్లిన్ అనే వెబ్ సిరీస్ ఉండగా.. ఇది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వేధికాగ స్ట్రీమింగ్ అవుతుంది. మనీ హైస్ట్ సిరీస్ కు ముందు బెర్లిన్ ఏం చేశాడో చెప్పే ఆకస్తికర కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కగా.. మొత్తం ఐదు ఎపిసోడ్ లో ఉన్నాయి. అయతే డిసెంబర్ 29వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతూ.. విశేష ప్రేక్షకాదరణ పొందింది.

Ormax Media Company Has Released Top 10 OTT Originals in India Based on Buzz
Ormax Media Company Has Released Top 10 OTT Originals in India Based on Buzz

టాప్ 5లో లెజెండ్ ఆఫ్ హనుమాన్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. లెజెండ్ ఆఫ్ హనుమాన్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 26 ఎపిసోడ్లు ఉండగా.. జనవరి 12వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. టాప్ 6లో ఆర్య 3 నిలిచింది. సుస్మితా సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఆర్య, ఆర్య 2 ప్రేక్షకులను విపరీతంగా మెప్పించగా.. నవంబర్ మూడో తేదీ నుంచి ఆర్య 3 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది.

Ormax Media Company Has Released Top 10 OTT Originals in India Based on Buzz

ఇక టాప్ 7లో షార్క్ ట్యాంక్ సీజన్ 3 జనవరి 22వ తేదీ నుంచి సోనీ ఎంటర్ టైన్ మెంట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 8లో ఎకో అనే వెబ్ సిరీస్ నిలిచింది. ఇది జనవరి 9వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే టాప్ 9లో ది రైల్వే మెన్ నాలుగు ఎపిసోడ్ లు కల్గిన ఈ వెబ్ సిరీస్ 2023 నవంబర్ 18వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ప్లిక్స్ వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక చివరలో పదో స్థానంలో అక్కినేని నాగచైతన్య హీరోగా చేసిన దూత వెబ్ సిరీస్ నిలిచింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అందుబాటులో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X