OTTలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టాప్ 10 వెబ్ సిరీస్‌లు ఇవే.. వన్‌లో ఫాలౌట్, 2లో ఏముందంటే?

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి, అది చేసే సర్వేల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు, సినీ తారలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ ఉంటుంది. సరైన ఫలితాలు వెల్లడిస్తూ.. టాప్ లో నిలుస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్టును వెల్లడిస్తుంది. అయితే తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ తాజాగా వెబ్ సిరీస్ లపై సర్వే చేసింది. అయితే తాజాగా టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టును విడదుల చేసింది. అందులో టాప్ 1లో ఫాలౌట్ ఉండగా.. నాలుగో స్థానంలో ఇన్ స్పెక్టర్ రిషి నిలిచింది.

ఏప్రిల్ 19వ తేదీ నుంచి 25వ తేదీ ఉన్న టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టులో అదిరిపోయే వెబ్ సిరీస్ లు ఉన్నాయి. ముఖ్యంగా ఓటీటీ ప్రియులు అంతా ఇష్టపడే ఈ వెబ్ సిరీస్ లలో టాప్ 10లో ఏవోవీ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్మాక్స్ చేసిన ఈ సర్వేలో టాప్ 1లో ఫాలౌట్ నిలిచింది. అదిరిపోయే కథాంశంతో వచ్చిన ఈ క్రైమ్ డ్రామా సిరిసీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. మీరు కూడా ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. అలాగే టాప్ 2లో అమర్ సింగ్ చమ్కిలా నిలిచింది.

Ormax Media Company Released Top 10 OTT Web Series of 2024 April 4th Week Originals in India

విండో సీట్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ ఎల్‌ఎల్‌పీ, సరిగమ బ్యానర్‌పై ఇంతియాజ్ అలీ, మోహిత్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించాడు. దిల్జీజ్ దోసాంజ్, పరిణీతి చోప్రా, రాహుల్ మిత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేశారు. రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక టాప్ 3లో ఇన్ స్పెక్టర్ రిషి నిలిచింది. క్రైమ్ థిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో నవీన్ చంద్ర హీరోగా చేయగా.. రిషి పాత్రలో నటిచి మెప్పించాడు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో స్థానంలో నిలవగా.. మార్చి 29వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

నాలుగో స్థానంలో అంటే టాప్ 4లో హీరామండి నిలిచింది. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ మరియు షర్మిన్ సెగల్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించిన ఈ వెబ్ సిరీస్ ను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు. మే 1వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ను చూసేందుకు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక టాప్ 5లో లూటేరే నిలిచింది. రజత్ కపూర్, వివేక్ గోంబర్, అమృతా ఖన్విల్కర్, చందన్ రాయ్ సన్యాల్, ప్రీతికా చావ్లా వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ 2 ఎపిసోడ్ లు ఇప్పటికీ విడుదల కాగా మార్చి 28వ తేదీన మరో ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

Ormax Media Company Released Top 10 OTT Web Series of 2024 April 4th Week Originals in India

ఇక టాప్ 6లో యే మెరీ ఫ్యామిలీ సీజన్ 3 నిలిచింది. అమెజాన్ మిని టీవీ వేదికగా ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఏడో స్థానంలో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో నిలిచింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా.. మార్చి 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 8లో 3 బడీ ప్రాబ్లమ్ నిలిచింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ను అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

అలాగే టాప్ 9లో మహారాణి సీజన్ 3 నిలిచింది. సౌరభ్ బేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ సీనీ లివ్ వేదికగా మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ను అనేక మంది చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అలాగే చివరి స్థానంలో అంటే టాప్ 10లో షో టైమ్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. అర్చిత్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో ఇమ్రాన్ హష్మి, నసీరుద్దిన్, మౌనీ రాయ్, మహిమ, రాజీవ్ ఖండేల్వాల్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X