OTTలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టాప్ 10 వెబ్ సిరీస్‌లు ఇవే.. ఒక్కటి కూడా మిస్ కాకండి!
ఆర్మాక్స్ మీడియా సంస్థ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, సినీ తారలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ ఉంటుంది. సరైన ఫలితాలు వెల్లడిస్తూ.. ఏవేవి ట్రెండింగ్ లో ఉన్నాయి, ఏవి టాప్ లో నిలుస్తున్నాయి వంటి విషయాల గురించి చెబుతుంటుంది. అయితే తాజాగా మరోసారి సర్వే నిర్వహించిన ఆర్మాక్స్ మీడియా సంస్థ టాప్ 10 వెబ్ సిరీస్ లు లిస్టును విడుదల చేసింది. అందులో టాప్ 10లో ఏవేవి ఉన్నాయో చెప్పింది.
ఏప్రిల్ 12వ తేదీ నుంచి 18వ తేదీ ఉన్న టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టులో అమర్ సింగ్ చమ్కిలా మొదటి స్థానంలో నిలిచింది. విండో సీట్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ ఎల్‌ఎల్‌పీ, సరిగమ బ్యానర్‌పై ఇంతియాజ్ అలీ, మోహిత్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించాడు. దిల్జీజ్ దోసాంజ్, పరిణీతి చోప్రా, రాహుల్ మిత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేశారు. రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక టాప్ లో ఇన్ స్పెక్టర్ రిషి నెంబర్ నిలిచింది.

క్రైమ్ థిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో నవీన్ చంద్ర హీరోగా చేయగా.. రిషి పాత్రలో నటిచి మెప్పించాడు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో స్థానంలో నిలవగా.. మార్చి 29వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 3లో లూటేరే వెబ్ సిరీస్ నిలిచింది. రజత్ కపూర్, వివేక్ గోంబర్, అమృతా ఖన్విల్కర్, చందన్ రాయ్ సన్యాల్, ప్రీతికా చావ్లా వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ 2 ఎపిసోడ్ లు ఇప్పటికీ విడుదల కాగా మార్చి 28వ తేదీన మరో ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
అలాగే టాప్ 4లో ఫాల్ ఔట్ నిలిచింది. అదిరిపోయే కథాంశంతో వచ్చిన ఈ క్రైమ్ డ్రామా సిరిసీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. మీరు కూడా ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. ఇక టాప్ 5లో మెరీ ఫ్యామిలీ సీజన్ 3 నిలిచింది. అమెజాన్ మిని టీవీ వేదికగా ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఆరో స్థానంలో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో నిలిచింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా.. మార్చి 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక టాప్ 7లో 3 బాడీ ప్రాబ్లమ్ నిలిచింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ను అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక టాప్ 8లో అదృశ్యం ది ఇన్విజిబుల్ హీరోస్ నిలిచింది. దివ్యాంక త్రిపాఠి, స్వరూప ఘోష్, తరుణ్ ఆనంద్, ఇజాజ్ ఖాన్ లు ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక టాప్ 9లో మహారాణి సీజన్ 3 నిలిచింది. సౌరభ్ బేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ సీనీ లివ్ వేదికగా మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ను అనేక మంది చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అలాగే చివరి స్థానంలో అంటే టాప్ 10లో షో టైమ్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. అర్చిత్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో ఇమ్రాన్ హష్మి, నసీరుద్దిన్, మౌనీ రాయ్, మహిమ, రాజీవ్ ఖండేల్వాల్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











