OTTలో ఇప్పిడీ వెబ్‌సిరీస్‌లదే హవా.. వన్‌లో ఇన్స్‌పెక్టర్ రిషి, మిగతా స్థానాల్లో ఏమున్నాయంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లు, హీరోహీరోయిన్లు, టీవీ సెలబ్రిటీలు.. ఇతర షోలపై ప్రతీ వారంసర్వేలు చేస్తూ ఉంటుంది. అంతేకాదండోయ్ సరైన ఫలితాలను కూడా వెల్లడిస్తుంటుంది. అయితే తాజాగా ఈ సంస్థ టాప్ 10 వెబ్ సిరీస్ లు ఏవి.. వేటిని జనాలు ఎక్కువగా ఇష్టపడి చూస్తున్నారనే దానిపై సర్వే చేసింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఎక్స్ వేదికగా ప్రకటించింది. అయితే ఆ టాప్ 10 వెబ్ సిరీస్ లు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఏప్రిల్ 5వ తేదీ నుంచి 11వ తేదీ ఉన్న టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టులో ఇన్ స్పెక్టర్ రిషి నెంబర్ వన్ స్థానంలో ఉంది. క్రైమ్ థిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో నవీన్ చంద్ర హీరోగా చేశాడు. రిషి పాత్రలో నటించి మెప్పించాడు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నెంబర్ వన్ స్థానంలో నిలవగా.. మార్చి 29వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 2లో లూటేరే వెబ్ సిరీస్ నిలిచింది. రజత్ కపూర్, వివేక్ గోంబర్, అమృతా ఖన్విల్కర్, చందన్ రాయ్ సన్యాల్, ప్రీతికా చావ్లా వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ 2 ఎపిసోడ్ లు ఇప్పటికీ విడుదల కాగా మార్చి 28వ తేదీన మరో ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

అలాగే టాప్ 3లో మహారాణి సీజన్ 3 నిలిచింది. సౌరభ్ బేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ సీనీ లివ్ వేదికగా మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ను అనేక మంది చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక టాప్ 4లో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో నిలిచింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా.. మార్చి 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 5లో మామ్లా లీగల్ హై నిలిచింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే తొమ్మిదో స్థానంలో పోచర్ నిలిచింది.
అందరు మెచ్చిన టాప్ 10 వెబ్ సిరీస్ లలో ఆరో స్థానంలో యె మెరీ ఫ్యామిలీ సీజన్ 3 నిలిచింది. అమెజాన్ మిని టీవీ వేదికగా ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే టాప్ 7లో ఫ్యామిలీ ఆజ్ కల్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ వేదికగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా.. అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక టాప్ 8లో మర్డర్ ముబారక్ నిలిచింది. మార్చి 15వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ను అనేక మంది చూస్తున్నారు.
ఇక టాప్ 9 స్థానంలో ఇండియాలోనే అతిపెద్ద రియల్ క్రైమ్ థ్రిల్లర్ పోచర్ నిలిచింది. రిచీ మెహతా దర్శకత్వంలో నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దివ్యేందు భట్టాచార్య, రంజితా మీనన్ సహా తదితరులు ఇందులో నటించగా.. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే చివరి స్థానంలో అంటే టాప్ 10లో షో టైమ్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. అర్చిత్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో ఇమ్రాన్ హష్మి, నసీరుద్దిన్, మౌనీ రాయ్, మహిమ, రాజీవ్ ఖండేల్వాల్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











