OTTలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టాప్ 10 వెబ్ సిరీస్‌లు.. వీటిలో మీరేదైనా మిస్ అయ్యారా!

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు సినిమాలు, సినీ తారలు, వెబ్ సిరీస్ లపై సర్వేలు చేసే ఈ సంస్థ సరైన ఫలితాలను వెల్లడిస్తుంటుంది. ముఖ్యంగా ఈ సంస్థ టాప్ 10 వెబ్ సిరీస్ లు ఏవనే దానిపై సర్వే నిర్వహించింది. ఇప్పటికే విడుదల అయినవి మాత్రమే కాకుండా ముందు ముందు విడుదల అయ్యే వెబ్ సిరీస్ లను కూడా అందులో మెన్షన్ చేశారు. ఆ జాబితాను ఎక్స్ వేదికగా ప్రకటించారు కూడా. అయితే ఆ టాప్ 10 వెబ్ సిరీస్ లు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మార్చి 29వ తేదీ నుంచి ఎప్రిల్ 6వ తేదీ ఉన్న టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టులో ఇన్ స్పెక్టర్ రిషి నెంబర్ వన్ స్థానంలో ఉంది. క్రైమ్ థిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో నవీన్ చంద్ర హీరోగా చేశాడు. రిషి పాత్రలో నటించి మెప్పించాడు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నెంబర్ వన్ స్థానంలో నిలవగా.. మార్చి 29వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 2లో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో నిలిచింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా.. మార్చి 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

Ormax Media Company Released Top 10 OTT Web Series of March 2024 Originals in India

ఇకా టాప్ 3లో మర్డర్ ముబారక్ నిలిచింది. మార్చి 15వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ను అనేక మంది చూస్తున్నారు. అలాగే టాప్ 4లో 3 బాడీ ప్రాబ్లమ్స్ నిలిచింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లో కల్గిన ఈ వెబ్ సిరీస్ మార్చి 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా.... అంతా ఆసక్తిగా ఈ వెబ్ సిరీస్ ను చూస్తున్నారు.

Ormax Media Company Released Top 10 OTT Web Series of March 2024 Originals in India

అందరు మెచ్చిన టాప్ 10 వెబ్ సిరీస్ లలో ఐదో స్థానంలో మహారాణి సీజన్ 3 వెబ్ సిరీస్ నిలిచింది. సౌరభ్ బేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ సీనీ లివ్ వేదికగా మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ను అనేక మంది చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అలాగే టాప్ 6లో లూటేరే వెబ్ సిరీస్ నిలిచింది. రజత్ కపూర్, వివేక్ గోంబర్, అమృతా ఖన్విల్కర్, చందన్ రాయ్ సన్యాల్, ప్రీతికా చావ్లా వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ 2 ఎపిసోడ్ లు ఇప్పటికీ విడుదల కాగా మార్చి 28వ తేదీన మరో ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక టాప్ 7లో షో టైమ్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. అర్చిత్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో ఇమ్రాన్ హష్మి, నసీరుద్దిన్, మౌనీ రాయ్, మహిమ, రాజీవ్ ఖండేల్వాల్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 8లో మామ్లా లీగల్ హై వెబ్ సిరీస్ నిలిచింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే తొమ్మిదో స్థానంలో పోచర్ నిలిచింది.

టాప్ 9లో నిలిచిన ఈ పోచర్ వెబ్ సిరీస్ ను.. ఇండియాలోనే అతిపెద్ద రియల్ క్రైమ్ థ్రిల్లర్ పోచర్ నిలిచింది. రిచీ మెహతా దర్శకత్వంలో నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దివ్యేందు భట్టాచార్య, రంజితా మీనన్ సహా తదితరులు ఇందులో నటించగా.. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 10లో ఏఈ వతన్ మేరే వతన్ నిలిచింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ వెబ్ సిరీస్.. మార్చి 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X