Top 10 Web Series: అందరూ కచ్చితంగా చూడాల్సిన టాప్ 10 వెబ్ సిరీస్‌లు ఇవే.. ఏ ఒక్కటీ మిస్ కాకండి!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు అందరికీ తెలిసిందే. సినిమాలు, వెబ్ సిరీస్ లు , సినీ తారలపై ప్రతీ వారం సర్వేలు చేస్తూ సరైన ఫలితాలను వెల్లడిస్తుంటుంది. ముఖ్యంగా టాప్ 10లో నిలిచిన వాటి లిస్టును చెబుతూ.. సినీ ప్రియులు తమకు నచ్చిన వాటిని గుర్తించేలా చేస్తుంటుంది. అయితే తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ తాజాగా వెబ్ సిరీస్ లపై సర్వే చేసింది. అయితే తాజాగా టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టును విడదుల చేసింది. అందులో టాప్ 1లో హీరామండి ఉండగా.. రెండో స్థానంలో ఫాల్ ఔట్ వెబ్ సిరీస్ నిలిచింది.
ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 2వ తేదీన వరకు ఓటీటీలో ట్రెండింగ్ లో నిలిచిన టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టును రిలీజ్ చేసింది. ముఖ్యంగా ఓటీటీ ప్రియులు అంతా ఇష్టపడే ఈ వెబ్ సిరీస్ లలో టాప్ 10లో ఏమేం ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్మాక్స్ చేసిన ఈ సర్వేలో టాప్ 1లో హీరామండి వెబ్ సిరీస్ నిలిచింది. హీరామండి: ది డైమండ్ బజార్ ను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరిస్.. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళల్లో భాషలతో పాటు 9 విదేశీ భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.

ఇక టాప్ 2లో ఫాల్ ఔట్ వెబ్ సిరీస్ నిలిచింది. ఫాలౌట్ నిలిచింది. అదిరిపోయే కథాంశంతో వచ్చిన ఈ క్రైమ్ డ్రామా సిరిసీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. మీరు కూడా ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. అలాగే టాప్ 3లో అమర్ సింగ్ చమ్కిలా నిలిచింది. విండో సీట్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ ఎల్‌ఎల్‌పీ, సరిగమ బ్యానర్‌పై ఇంతియాజ్ అలీ, మోహిత్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించాడు. దిల్జీజ్ దోసాంజ్, పరిణీతి చోప్రా, రాహుల్ మిత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేశారు. రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇక టాప్ 4లో రణనీతి-బాలాకోట్ అండ్ బియాండ్ అనే వెబ్ రిసీస్ నిలిచింది. సంతోష్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో జిమ్మీ షేర్గిల్, లారా దత్తా, ఆశిష్ విద్యార్థి, అశుతోష్ రాణా, సత్యజీత్ దూబే, ఎల్నాజ్ నోరౌజీ, మీర్ సర్వర్, ఆకాంక్షా సింగ్, సందీప్ ఛటర్జీ, సునీల్ సిన్హాలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 25వ తేదీ నుంచి జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రేజీ వెబ్ సిరీస్ ను మీరు కూడా ఓసారి చూసేయండి. ఇక టాప్ 5లో పంచాయత్ సీజన్ 3 నిలిచింది. దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మే 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. కానీ గత సీజన్లకు వచ్చిన క్రేజ్ తో దీన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా ఈ కామెడీ డ్రామా సిరీస్ ట్రెండింగ్ లో నిలిచింది.

అలాగే టాప్ 6లో ఇన్ స్పెక్టర్ రిషి నిలిచింది. క్రైమ్ థిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో నవీన్ చంద్ర హీరోగా చేయగా.. రిషి పాత్రలో నటిచి మెప్పించాడు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో స్థానంలో నిలవగా.. మార్చి 29వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఆ తర్వాత స్థానంలో అంటే టాప్ 7లో దిల్ దోస్తీ డైలమా నిలిచింది. అనుష్క సేన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు డెబ్బీ రావ్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఈ క్రేజీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
టాప్ 8లో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో నిలిచింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా.. మార్చి 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 9లో షో టైమ్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. అర్చిత్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో ఇమ్రాన్ హష్మి, నసీరుద్దిన్, మౌనీ రాయ్, మహిమ, రాజీవ్ ఖండేల్వాల్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక చివరగా అంటే టాప్ 10లో చాచా విధాయక్ హై హుమరే S3 నిలిచింది. అమెజాన్ మినీ టీవీ వేదికగా ఈ క్రేజీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం ఈ క్రేజీ వెబ్ సిరీస్ లను కచ్చితంగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











