సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టాప్ 10 వెబ్ సిరీస్‌లు ఇవే.. వన్‌లో హీరామండి, మిగతా స్థానాల్లో ఏమున్నాయంటే?

ఆర్మాక్స్ మీడియా సంస్థ గురించి అది చేసే సర్వేల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, సినీ తారలపై ప్రతీ వారం సర్వేలు చేస్తూ సరైన ఫలితాలను వెల్లడిస్తూ.. ఏమేం చూడాలో చెబుతుంటుంది. ముఖ్యంగా టాప్ 10లో నిలిచే హీరో, హీరోయిన్లతో పాటు సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్టును విడుదల చేస్తుంది. అందులో టాప్ 1లో హీరామండి వెబ్ సిరీస్ నిలవగా.. రెండో స్థానంలో పంచాయత్ సీజన్ 3 నిలిచింది.

ఏప్రిల్ 3వ తేదీ నుంచి మే 9వ తేదీన వరకు ఓటీటీలో ట్రెండింగ్ లో నిలిచిన టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టును తాజాగా విడుదల చేసింది. ముఖ్యంగా దేశం మొత్తం మెచ్చిన వెబ్ సిరీస్ లలో టాప్ 10లో ఏమేం ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆర్మాక్స్ చేసిన ఈ సర్వేలో టాప్ 1లో హీరామండి వెబ్ సిరీస్ నిలిచింది. హీరామండి: ది డైమండ్ బజార్ ను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరిస్.. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళల్లో భాషలతో పాటు 9 విదేశీ భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.

Ormax Media Company Released Top 10 OTT Web Series of May 2nd Week 2024 Originals in India

ఇక టాప్ 2లో పంచాయత్ సీజన్ 3 నిలిచింది. అయితే ఇప్పటికీ విడుదల కానీ ఈ వెబ్ సిరీస్ ను చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ వెబ్ సిరీస్ మే 28వ తేదీన విడుదల కాబోతుంది. ఇక టాప్ 3లో రణనీతి-బాలాకోట్ అండ్ బియాండ్ అనే వెబ్ రిసీస్ నిలిచింది. సంతోష్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో జిమ్మీ షేర్గిల్, లారా దత్తా, ఆశిష్ విద్యార్థి, అశుతోష్ రాణా, సత్యజీత్ దూబే, ఎల్నాజ్ నోరౌజీ, మీర్ సర్వర్, ఆకాంక్షా సింగ్, సందీప్ ఛటర్జీ, సునీల్ సిన్హాలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 25వ తేదీ నుంచి జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రేజీ వెబ్ సిరీస్ ను మీరు కూడా ఓసారి చూసేయండి.

ఇక టాప్ 4లో ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2 నిలిచింది. సోనాలీ బింద్రే, జైదీప్ అహ్లావత్, శ్రియ పిల్గాంకర్, అక్షయ్ ఒబెరాయ్, ఇంద్రనీల్ సేన్ గుప్తాలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించిన ఈ వెబ్ సిరీస్ ను వినయ్ వైకుల్ డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ మే3వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.ఇక టాప్ 5లో ఫాల్ ఔట్ వెబ్ సిరీస్ నిలిచింది. ఫాలౌట్ నిలిచింది. అదిరిపోయే కథాంశంతో వచ్చిన ఈ క్రైమ్ డ్రామా సిరిసీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. మీరు కూడా ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

అలాగే టాప్ 6లో అమర్ సింగ్ చమ్కిలా నిలిచింది. విండో సీట్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ ఎల్‌ఎల్‌పీ, సరిగమ బ్యానర్‌పై ఇంతియాజ్ అలీ, మోహిత్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించాడు. దిల్జీజ్ దోసాంజ్, పరిణీతి చోప్రా, రాహుల్ మిత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేశారు. రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక టాప్ 7లో దిల్ దోస్తీ డైలమా నిలిచింది. అనుష్క సేన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు డెబ్బీ రావ్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఈ క్రేజీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక టాప్ 8లో అలాగే టాప్ 6లో ఇన్ స్పెక్టర్ రిషి నిలిచింది. క్రైమ్ థిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో నవీన్ చంద్ర హీరోగా చేయగా.. రిషి పాత్రలో నటిచి మెప్పించాడు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో స్థానంలో నిలవగా.. మార్చి 29వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఆ తర్వాత స్థానంలో అంటే టాప్ 9లో టాప్ 8లో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో నిలిచింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా.. మార్చి 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 10లో షో టైమ్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. అర్చిత్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో ఇమ్రాన్ హష్మి, నసీరుద్దిన్, మౌనీ రాయ్, మహిమ, రాజీవ్ ఖండేల్వాల్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X