Top 10 Web Series: ఈవారం ఓటీటీని ఊపేస్తున్న టాప్ 10 వెబ్ సిరీస్‌లు ఇవే.. ఓ ఒక్కటి మిస్ అయినా!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ చేసే సర్వేల గురించి దేశ వ్యాప్తంగా సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ వారం.. అటు థియేటర్లు, టీవీలు, ఓటీటీల్లో ఏయే సినిమాలు సందడి చేస్తున్నాయి, ఏవి టాప్ లో నిలుస్తున్నాయి అనే దానిపై సర్వేలు చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా మే నెల 3వ వారానికి సంబంధించిన టాప్ 10 వెబ్ సిరీస్ లు ఏవనే దానిపై ఆర్మాక్స్ మీడియా సంస్థ సర్వే చేసింది. పూర్తిగా సినీ ప్రియుల అభిప్రాయం తీసుకుని టాప్ 10లో నిలిచిన వెబ్ సిరీస్ ల లిస్టును రిలీజ్ చేసింది. అందులో ఏమేం ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మే 10వ తేదీ నుంచి మే 16వ తేదీన వరకు ఓటీటీలో ట్రెండింగ్ లో నిలిచిన టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టులో.. టాప్ 1లో హీరామండి వెబ్ సిరీస్ నిలిచింది. హీరామండి: ది డైమండ్ బజార్ ను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరిస్.. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళల్లో భాషలతో పాటు 9 విదేశీ భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.

ఇక టాప్ 2లో పంచాయత్ సీజన్ 3 నిలిచింది. అయితే ఇప్పటికీ విడుదల కానీ ఈ వెబ్ సిరీస్ ను చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ వెబ్ సిరీస్ మే 28వ తేదీన విడుదల కాబోతుంది. ఇక టాప్ 3లో ఉండెఖి అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నిలిచింది. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎడ్జ్‌స్టార్మ్ వెంచర్స్ నిర్మించిని ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ వేదికగా మే 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ కాగా.. మూడో సీజన్ ను కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు జనాలు.
ఇక టాప్ 4లో మర్డర్ ఇన్ మహిమ్ నిలిచింది. విజయ్ రాజ్, అశుతోష్ రానా, శివానీ రఘువంశీలు ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ జియో సినిమా వేదికగా మే 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రేజీ వెబ్ సిరీస్ ను అనేక మంది ఇష్టంగా చూస్తున్నారు. ఇక టాప్ 5లో సోనాలీ బింద్రే, జైదీప్ అహ్లావత్, శ్రియ పిల్గాంకర్, అక్షయ్ ఒబెరాయ్, ఇంద్రనీల్ సేన్ గుప్తాలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించిన ఈ వెబ్ సిరీస్ ను వినయ్ వైకుల్ డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ మే3వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

అలాగే ఆరో స్థానంలో అంటే టాప్ 6లో రణనీతి-బాలాకోట్ అండ్ బియాండ్ అనే వెబ్ రిసీస్ నిలిచింది. సంతోష్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో జిమ్మీ షేర్గిల్, లారా దత్తా, ఆశిష్ విద్యార్థి, అశుతోష్ రాణా, సత్యజీత్ దూబే, ఎల్నాజ్ నోరౌజీ, మీర్ సర్వర్, ఆకాంక్షా సింగ్, సందీప్ ఛటర్జీ, సునీల్ సిన్హాలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 25వ తేదీ నుంచి జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రేజీ వెబ్ సిరీస్ ను మీరు కూడా ఓసారి చూసేయండి.
టాప్ 7లో ఇన్ స్పెక్టర్ రిషి నిలిచింది. క్రైమ్ థిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో నవీన్ చంద్ర హీరోగా చేయగా.. రిషి పాత్రలో నటిచి మెప్పించాడు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో స్థానంలో నిలవగా.. మార్చి 29వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. టాప్ 8లో అమర్ సింగ్ చమ్కిలా నిలిచింది. విండో సీట్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ ఎల్‌ఎల్‌పీ, సరిగమ బ్యానర్‌పై ఇంతియాజ్ అలీ, మోహిత్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించాడు. దిల్జీజ్ దోసాంజ్, పరిణీతి చోప్రా, రాహుల్ మిత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

టాట్ 9లో దిల్ దోస్తీ డైలమా నిలిచింది. అనుష్క సేన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు డెబ్బీ రావ్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఈ క్రేజీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక చివరి స్థానంలో అంటే టాప్ 10లో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో నిలిచింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా.. మార్చి 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఆ పది వెబ్ సిరీస్ లలో ఒకటి మిస్ అయినా మీరు చాలా మిస్ అయినట్లే. సో డోంట్ మిస్ ఇట్.


Click it and Unblock the Notifications











