OTTలో రచ్చ లేపుతున్న టాప్ 10 వెబ్‌సిరీస్‌లు ఇవే.. వన్‌లో హీరామండి, మిగతా స్థానాల్లో ఏమున్నాయంటే?
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ చేసే సర్వేల గురించి దేశ వ్యాప్తంగా సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ తారలు, సినిమాలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ సరైన ఫిలితాలను వెల్లడించే ఈ సంస్థ.. తాజాగా మరో సర్వే చేస్తోంది. ప్రతీ వారం అటు థియేటర్లు, టీవీలు, ఓటీటీల్లో ఏయే సినిమాలు సందడి చేస్తున్నాయి, ఏవి టాప్ లో నిలుస్తున్నాయి అనే దానిపై సర్వే చేసింది. అయితే తాజాగా మే నెల 4వ వారానికి సంబంధించిన టాప్ 10 వెబ్ సిరీస్ లు ఏవనే దానిపై ఆర్మాక్స్ మీడియా సంస్థ సర్వే చేసింది. అందులో ఏమేం ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మే 17 తేదీ నుంచి మే 23వ తేదీ వరకు ఓటీటీలో ట్రెండింగ్ లో నిలిచిన టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టులో.. టాప్ 1లో హీరామండి వెబ్ సిరీస్ నిలిచింది. హీరామండి: ది డైమండ్ బజార్ ను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరిస్.. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళల్లో భాషలతో పాటు 9 విదేశీ భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.

ఇక టాప్ 2లో పంచాయత్ సీజన్ 3 నిలిచింది. అయితే ఇప్పటికీ విడుదల కానీ ఈ వెబ్ సిరీస్ ను చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ వెబ్ సిరీస్ మే 28వ తేదీన విడుదల కాబోతుంది. ఇక టాప్ 3లో మర్డర్ ఇన్ మహిమ్ నిలిచింది. విజయ్ రాజ్, అశుతోష్ రానా, శివానీ రఘువంశీలు ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ జియో సినిమా వేదికగా మే 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రేజీ వెబ్ సిరీస్ ను అనేక మంది ఇష్టంగా చూస్తున్నారు.
ఇక టాప్ 4లో ఉండెఖి అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నిలిచింది. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎడ్జ్‌స్టార్మ్ వెంచర్స్ నిర్మించిని ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ వేదికగా మే 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ కాగా.. మూడో సీజన్ ను కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు జనాలు. ఇక టాప్ 5లో బాహుబలి: క్రౌన్ ఆఫ్ ది బ్లడ్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. జీవన్ జె కాంగ్, నవీన్ జాన్ ల దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు.. శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, జీవన్ జె కాంగ్, ఎస్ఎస్ రాజమౌళి, శరద్ దేవరాజన్, షేక్ మక్బూల్ లు నిర్మించారు. డిన్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా మే 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక టాప్ 6లో జమ్నాపార్ నిలిచింది. ఆదర్శ్ చౌదరి, శుభం సప్రే, అభిషేక్ లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ మినీ టీవీలో నిలిచింది. మే 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ను అంతా ఆసక్తి చూస్తుండగా.. టాప్ లో నిలిచింది. ఇక టాప్ 7లో రణనీతి-బాలాకోట్ అండ్ బియాండ్ అనే వెబ్ రిసీస్ నిలిచింది. సంతోష్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో జిమ్మీ షేర్గిల్, లారా దత్తా, ఆశిష్ విద్యార్థి, అశుతోష్ రాణా, సత్యజీత్ దూబే, ఎల్నాజ్ నోరౌజీ, మీర్ సర్వర్, ఆకాంక్షా సింగ్, సందీప్ ఛటర్జీ, సునీల్ సిన్హాలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 25వ తేదీ నుంచి జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రేజీ వెబ్ సిరీస్ ను మీరు కూడా ఓసారి చూసేయండి.

టాప్ 8లో ది బ్రోకెన్ న్యూస్ 2 నిలిచింది. సోనాలీ బింద్రే, జైదీప్ అహ్లావత్, శ్రియ పిల్గాంకర్, అక్షయ్ ఒబెరాయ్, ఇంద్రనీల్ సేన్ గుప్తాలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించిన ఈ వెబ్ సిరీస్ ను వినయ్ వైకుల్ డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ మే3వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 9లో నమాకూల్ నిలిచింది. మయాంక్ అండ్ పియూష్ ఎంబార్క్ లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక టాప్ 10లో బ్రిడ్జర్టన్ నిలిచింది. క్రిస్ వాన్ డ్యూసెన్ రూపొందించిన ఒక అమెరికన్ హిస్టారికల్ రొమాన్స్ టెలివిజన్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా మే 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా.. టాప్ 10లో నిలిచింది.


Click it and Unblock the Notifications











