Top 10 Web Series: OTTని ఏలేస్తున్న టాప్ 10 వెబ్‌సిరీస్‌లు ఇవే.. వన్‌లో పంచాయత్, మరి మిగతా స్థానాల్లో?
ఆర్మాక్స్ మీడియా సంస్థ గురించి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ తారలు, సినిమాలు, వెబ్ సిరీస్ లపై ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ సరైన ఫిలితాలను వెల్లడించే ఈ సంస్థ.. తాజాగా మరో సర్వే చేసింది. ప్రతీ వారం అటు థియేటర్లు, టీవీలు, ఓటీటీల్లో ఏయే సినిమాలు సందడి చేస్తున్నాయి, ఏవి టాప్ లో నిలుస్తున్నాయి అనే దానిపై సర్వే చేసింది. అయితే తాజాగా మే నెల 5వ వారానికి సంబంధించిన టాప్ 10 వెబ్ సిరీస్ లు ఏవనే దానిపై ఆర్మాక్స్ మీడియా సంస్థ సర్వే చేసింది. అందులో ఏమేం ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మే 24 తేదీ నుంచి మే 30వ తేదీ వరకు ఓటీటీలో ట్రెండింగ్ లో నిలిచిన టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టులో.. టాప్ 1లో పంచాయత్ సీజన్ 3 నిలిచింది. అయితే మే 28వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ను చాలా మంది చూస్తున్నారు. ముందు వచ్చిన రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్ కాగా ఈ మూడో సీజన్ కూడా అంతకు మించి ఉందని టాక్ నడుస్తోంది. ఇలా ఈ వెబ్ సిరీస్ టాప్ లో నిలిచింది. ఇకా టాప్ 2లో హీరామండి వెబ్ సిరీస్ నిలిచింది. హీరామండి: ది డైమండ్ బజార్ ను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు.

మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరిస్.. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళల్లో భాషలతో పాటు 9 విదేశీ భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. ఇక టాప్ 3లో మర్డర్ ఇన్ మహిమ్ నిలిచింది. విజయ్ రాజ్, అశుతోష్ రానా, శివానీ రఘువంశీలు ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ జియో సినిమా వేదికగా మే 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రేజీ వెబ్ సిరీస్ ను అనేక మంది ఇష్టంగా చూస్తున్నారు.
అలాగే టాప్ 4లో జమ్నాపార్ నిలిచింది. ఆదర్శ్ చౌదరి, శుభం సప్రే, అభిషేక్ లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ మినీ టీవీలో మే 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అద్బుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ చాలా బాగుందని అనేక మంది చెబుతుండగా.. టాప్ లో నిలిచింది. ఇక టాప్ 5లో ది బాయ్స్ సీజన్ 4 నిలిచింది. కార్ల్ అర్బన్, జాక్ క్వాయిడ్, ఆంటోనీ స్టార్, ఎరిన్ మోరియార్టీ, డొమినిక్ మెక్‌ఎల్లిగాట్, జెస్సీ టి. అషర్, చేస్ క్రాఫోర్డ్, లాజ్ అలోన్సో, టోమర్ కాపోన్, కరెన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. వారానికో ఎపిసోడ్ రాబోతుండగా... అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక టాప్ 6లో ది లెజండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 నిలిచింది. డిస్నీ హాట్ స్టార్ వేదికగా జనవరి 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇలా ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికీ టాప్ లోనే ఉంటోంది. అయితే టాప్ 7లో గుల్లక్ సీజన్ 4 నిలిచింది. అయితే ఈ వెబ్ సిరీస్ ఇంకా ఓటీటీలోకి రాలేదు. జూన్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఈ సిరీస్ ను అంతా చూడాలని తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలా ఈ వెబ్ సిరీస్ టాప్ లో నిలిచింది. ఇక టాప్ 8లో బాహుబలి: క్రౌన్ ఆఫ్ ది బ్లడ్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. జీవన్ జె కాంగ్, నవీన్ జాన్ ల దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు.. శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, జీవన్ జె కాంగ్, ఎస్ఎస్ రాజమౌళి, శరద్ దేవరాజన్, షేక్ మక్బూల్ లు నిర్మించారు. డిన్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా మే 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
అలాగే టాప్ 9లో ఇల్లీగల్ సీజన్ 3 నిలిచింది. సాహిర్ రజా దర్శకత్వం వహించిన ఈ లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నేహా శర్మ, అక్షయ్ ఒబెరాయ్, కుబ్రా సైత్, పీయూష్ మిశ్రా మరియు సత్యదీప్ మిశ్రాలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. మే 29వ తేదీ నుంచి జియో సినిమా వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 10లో బ్రిడ్జర్టన్ నిలిచింది. క్రిస్ వాన్ డ్యూసెన్ రూపొందించిన ఒక అమెరికన్ హిస్టారికల్ రొమాన్స్ టెలివిజన్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా మే 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా.. టాప్ 10లో నిలిచింది.


Click it and Unblock the Notifications











