OTTలో రఫ్ఫాడిస్తున్న రసవత్తరమైన చిత్రాలు ఇవే.. ఈ టాప్ 3 ట్రెండింగ్ మూవీస్ కచ్చితంగా చూడాల్సిందే!

ప్రతీ రోజూ ఓటీటీలోకి ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా వీక్ స్టార్టింగ్ తో పాటు వీకెండ్ లో అనేక చిత్రాలు సడెన్ గా ఓటీటీలోకి వచ్చి ఫుల్ ట్రీట్ ఇస్తుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే టాప్ లో నిలుస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. అయితే ఇలా టాప్ లో నిలిచిన సినిమాలు ఏంటి, వెబ్ సిరీస్ లు ఏంటనవే ఎప్పటికప్పుడు తెలియజేస్తూ.. సినీ ప్రియులకు శ్రమ లేకుండా చేస్తుంది ఆర్మాక్స్ మీడియా సంస్థ. ముఖ్యంగా ఏయే చిత్రాలు టాప్ లో ఉన్నాయి, కచ్చితంగా చూడాల్సిన చిత్రాలేవో సర్వే చేసి మరీ చెబుతుంటుంది. అయితే తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ ఆ సర్వే చేసి సరైన ఫిలితాలను వెల్లడించింది. మరి ఈ వారం టాప్ 3లో నిలిచిన క్రేజీ సినిమాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మే 24వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు ఓటీటీలో ట్రెండింగ్ లో నిలిచిన టాప్ 3 సినిమాల లిస్టును విడుదల చేసింది. ముఖ్యంగా ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన ఈ లిస్టులో టాప్ 1లో క్య్రూ నిలిచింది. ముగ్గురు స్టార్ హీరోయిన్లు కలిసి చేసిన క్రేజీ మూవీయే క్రూ. బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిల్మ్స్ & కమ్యూనికేషన్ నెట్‌వర్క్ బ్యానర్‌లపై ఏక్తా కపూర్, రియా కపూర్, అనిల్ కపూర్, దిగ్విజయ్ పురోహిత్ నిర్మించిన ఈ సినిమాకు రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేస్తున్న ముగ్గురు మహిళల జీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో టబు, కరీనా కపూర్ ఖాన్‌‌, కృతి సనన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. వీరితో పాటు ఈ సినిమాలో దిల్జీద్ దోసాంజ్, కపిల్ శర్మ, పూజా భమ్రా, కులభూషణ్ ఖర్బందా, లారీ న్యూయార్కర్, శాశ్వత ఛర్జీ, రోహిత్ చెత్రీ, అహ్మద్ కబీల్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

Ormax Media Company Released top 3 Movies list of May 24th to May 30th OTT

ఏప్రిల్ 29వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా మే 28వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అద్భుతమైన కథాంశంతో వచ్చిన ఈ సినిమా ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక టాప్ 2లో షైతాన్ సినిమా నిలిచింది. బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ద్వారానే జ్యోతిష హిందీ చిత్రసీమలో అడుగు పెట్టింది. అలాగే అజయ్ దేవగన్ హీరోగా చేశారు. అద్భుతమైన మిస్టరీ హార్రర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాకు వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. అలాగే దేవగన్ ఫిల్మ్స్ , జియో స్టూడియోస్ మరియు పనోరమా స్టూడియోస్ నిర్మించాయి.

Ormax Media Company Released top 3 Movies list of May 24th to May 30th OTT

జ్యోతిక్, అజయ్ దేవగన్ లు హీరోహీరోయిన్లుగా చేసిన ఈ సినిమాలో మాధవన్, జాంకీ బోడివాలా, అంగద్ రాజ్, పాలక్ లాల్వాణీ, మనోజ్ ఆనంద్, రిచా ప్రకాష్, హితేన్ పటేల్, రోష్ని కౌర్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అమిత్ త్రివేది సంగీతం అందించగా.. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే దీప్ ఫ్రాన్సిసి ఎడిటర్ గా పని చేశారు. 65 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు రూ.167.32 కోట్లు కలెక్షన్లు వచ్చాయి.

Ormax Media Company Released top 3 Movies list of May 24th to May 30th OTT

ఇక టాప్ 3లో లాపతా లేడీస్ మూవీ నిలిచింది. కామెడీ డ్రామాగా వచ్చిన ఈ క్రేజీ మూవీని కిరణ్ రావు డైరెక్ట్ చేశారు. అమీర్ ఖాన్, జ్యోతి దేశ్ పాండే లు ఈ చిత్రాన్ని నిర్మించారు. లాపతా లేడీస్ సినిమాలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ్, ఛాయా కదమ్, రవి కిషన్ లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. సెప్టెంబర్ 8వ తేదీ విడుదల అయిన ఈ సినిమాలో 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. దాదాపు రూ.23 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో రైలు ప్రయాణంలో ఇద్దరు భర్తలు తమ భార్యలను మార్చుకునే కథను చూపిస్తారు. ఆద్యంతం ఆకట్టుకునే ఈ సినిమాను చూసి కడుపుబ్బా నవ్వుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X