Bigg Boss Telugu 6 టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు? తాజా సర్వేలో సంచలనాలు.. ఎవరెవరికి చోటంటే?
బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షో చివరి అంకానికి చేరుకొన్నది. ఇక ప్రస్తుతం ఇంటిలో ఉన్న కంటెస్టెంట్లు టైటిల్‌ను ఎగురుకు పోయేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఫైనల్‌కు ముందు ఈ సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు అనే ప్రశ్న అందర్ని వెంటాడుతున్నది. అంతేకాకుండా ఈ ఏడాది విన్నర్ ఎవరు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి టాప్ 5 కంటెస్టెంట్లను ఓ సర్వే సంస్థ ప్రకటించింది. ఈ సర్వే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 6 ఆరో సీజన్ తుస్సుమందా?
గత 5 సీజన్లతో పోల్చుకొంటే బిగ్‌బాస్ తెలుగు 6 సీజన్ అంతగా ఆకట్టుకొలేకపోయిందనే అందరి వాదన. బిగ్‌బాస్ తెలుగు 6 ఫెయిల్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా చేశారు. అయితే కంటెస్టెంట్ల మధ్య హోరాహోరీ పోరు కనిపించలేదనేది వాస్తవంగానే మారింది. ఇలా ఎలాంటి సంచలనాలు లేకుండా బిగ్‌బాస్ తెలుగు 6 ముగింపు దశకు చేరుకున్నది.

చివరి వారంలో నామినేషన్లు ఇలా..
బిగ్‌బాస్ ఇంటిలో పోటాపోటీగా జరుగుతున్న పోరులో చివరి వారంలో 6 గురు నామినేట్ అయ్యారు. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న వారిలో రేవంత్, రోహిత్, ఇనయా సుల్తానా, ఆదిరెడ్డి, కీర్తి భట్, శ్రీసత్య ఉన్నారు. అయితే వీరిలో ఎవరు బయటకు వెళ్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

శ్రీహాన్‌కు ఫినాలే టికెట్
ఇక తాజా వారంలో నామినేట్ అయిన వారి నుంచి శ్రీహాన్‌కు మంచి ఛాన్స్ లభించింది. రేవంత్ నుంచి గట్టి పోటీని ఎదురించి ఫినాలే టికెట్‌ను శ్రీహాన్ దక్కించుకొన్నాడు. అయితే ఫినాలేకు చేరిన తొలి కంటెస్టెంట్ కావడంతో శ్రీహాన్‌కు ఎలిమినేషన్ బెడద తప్పినట్టయింది. అయితే ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ప్రశ్నకు కిర్తీ భట్ వీక్ క్యాండిడేట్‌గా కనిపిస్తున్నారు.

ఓర్మాక్స్ సర్వే ప్రకారం..
ఇక ఓర్మాక్స్ సర్వే ప్రకారం.. బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షోలో టాప్ 5 స్థానాలను గెలుచుకొన్న వారిలో అందరూ ఉహించిన వారే ఉన్నారు. 1వ స్థానంలో రేవంత్, రెండో స్థానంలో శ్రీహాన్, మూడో స్థానంలో శ్రీసత్య, నాలుగో స్థానంలో రోహిత్, ఐదో స్థానంలో ఆదిరెడ్డి నిలిచారు. అయితే ఓర్మాక్స్ సర్వేలో శ్రీసత్య టాప్ 5లోకి రావడం ఆశ్చర్యం కలిగించింది.

శ్రీ సత్య వర్సెస్ ఇనియా సుల్తానా
అయితే ఓర్మాక్స్ సర్వేను పక్కన పెడితే.. రేవంత్, శ్రీహాన్, రోహిత్, ఆదిరెడ్డితోపాటు ఇనయా సుల్తానాకు కూడా భారీ అవకాశాలే ఉన్నాయి. ఆమె కూడా టాప్ 5లో చోటు సంపాదించే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక టాప్ 5లో శ్రీసత్య చోటు సంపాదించుకొంటుందా? లేక ఇనియా సుల్తానా టాప్ 5లో నిలుస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











