Top 10 Web Series on OTT 40 మిలియన్ల వ్యూస్‌తో టాప్ 1 వెబ్ సిరీస్ ఏంటో తెలుసా?ఈ టాప్ 10 వెబ్ సిరీస్ చూశారా?

ప్రపంచవ్యాప్తంగా ఓటీటీలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ రోజు రోజుకు పెరుగుతున్నది. కరోనా వైరస్ లాక్‌డౌన్ కాలంలో ఓటీటీలకు అలవాటు పడిన ప్రేక్షకులు వాటిని తమ దైనందిక జీవితంలో భాగంగా చేసుకొన్నారు. ఓటీటీలో ఇండిపెండెంట్ సినిమాలకు, వెబ్ సిరీస్‌‌కు ఆదరణ పెరుగుతుంటంతో డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు ఫిల్మ్ మేకర్స్ వస్తున్నారు. ఈ క్రమంలో ఓరోమ్యాక్స్ (Ormax) రూపొందించిన టాప్ 10 స్థానంలో నిలిచిన వెబ్ సిరీస్ వివరాల్లోకి వెళితే...

ఓటీటీలో వెబ్ సిరీస్‌లో సెక్రెడ్ గేమ్స్‌కు మంచి ఆదరణ లభించింది. నవాజుద్దీన్ సిద్దిఖి, సైఫ్ ఆలీ ఖాన్, ఇల్నాజ్ నరౌజీ, కుబ్రా సెయిత్, రాజశ్రీ దేశ్‌పాండే, పంకజ్ త్రిపాఠి నటించారు. ఈ వెబ్ సిరీస్‌కు టాప్ 10వ స్థానంలో నిలిచింది. ఇక తొమ్మిది స్తానంలో స్కామ్ 1992, 8వ స్థానంలో ది గ్రేట్ ఇండియన్ మర్డర్ నిలిచింది. ఆ తర్వాత 7వ స్థానంలో తాజా కబర్, 6వ స్థానంలో ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్‌లో నిలిచాయి అని Ormax వెల్లడించింది.

Ormax media Top 10 Web Series in Indian OTT Platform

ఇక టాప్ 5 స్థానాల్లో నిలిచిన సినిమాల విషయానికి వస్తే.. డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన క్రిమినల్ జస్టిస్: బిహైండ్ క్లోజ్‌డ్ డోర్స్ 5వ స్థానంలో నిలిచింది. ఈ వెబ్ సిరీస్ 29.1 మిలియన్ల వ్యూస్ అంటే.. 2.9 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత పంజక్ కపూర్ నటించిన పంచాయత్ సిరీస్ 4వ స్థానంలో నిలిచింది. అలాగే మీర్జాపూర్ వెబ్ సిరీస్ 32 మిలియన్ల వ్యూస్ అంటే 3.2 కోట్ల వ్యూస్‌తో 3వ స్థానంలో నిలిచింది.

ఓరోమ్యాక్స్ (Ormax) జాబితాలో అజయ్ దేవగన్ నటించిన రుద్ర: ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ 2వ స్థానంలో నిలిచింది. ఈ వెబ్ సిరీస్ లూథర్ అనే బ్రిటీష్ షో నుంచి రూపొందించారు. ఈ వెబ్ సిరీస్‌లో 3.5 కోట్లు వ్యూస్ అంటే.. 35 మిలియన్ల వ్యూస్ సాధించింది.

Shahid Kapoors Farzi leading on Top

ఇక టాప్ 1 స్థానంలో నిలిచిన వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. రాజ్ అండ్ డీకే రూపొందించిన ఫర్జీ వెబ్ సిరీస్ అన్ని వర్గాలను ఆకట్టుకొని నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా షాహీద్ కపూర్ తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్ సేతుపతి, కేకే మీనన్, రాశీఖన్నా, రెజీనా కసండ్రా తదితరులు నటించారు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో రీలీజైన ఫర్జీ వెబ్ సిరీస్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ వెబ్ సిరీస్‌కు 40 మిలియన్ల వ్యూస్ అంటే సుమారుగా 4 కోట్ల వ్యూస్ లభించాయి. దాంతో టాప్ 1 స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు అత్యధికంగా వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్‌లో టాప్ నిలవడంతోపాటు ట్రెండింగ్‌గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X