OTTలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టాప్ 3 సినిమాలివే.. 2లో హనుమాన్, వన్‌లో ఏముందంటే?
ఓటీటీలోకి ప్రతీ వారం కొత్త సినిమాలు వస్తుండడంతో.. ఓటీటీ ప్రియులు తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. వచ్చే ప్రతీ సినిమాను, ముఖ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. థియేటర్లలో చూసినా సరే మరోసారి ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నచ్చిన సినిమాను వీలు దొరికినప్పుడల్లా చూస్తుండడంతో చాలా రోజుల క్రితం వచ్చిన సినిమాలు కూడా టాప్ ట్రెండింగ్ లో ఉంటూనే వస్తున్నాయి. ముఖ్యంగా గతేడాది విడుదల అయిన యానిమల్ సినిమా అయితే టాప్ 3లో ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే మార్చి 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు టాప్ 3లో ఏయే సినిమాలు నిలిచాయో మనం ఇప్పుడు చూద్దాం.
హృతిక్ రోషన్ హీరోగా చేసిన ఫైటర్ సినిమా టాప్ 1లో నిలిచింది. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్ మరియ్ మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హృతిక్ సరసన దీపికా పడుకోణె నటించి మెప్పించింది. అలాగే అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, కరణ్ సింగ్ గ్రోవర్, ఆమిర్ నాయక్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు.

జనవరి 25వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సూపర్ డూపర్ హిట్ సినిమా మార్చి 21వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమాను చాలా మంది వీక్షిస్తూనే ఉండగా.. టాప్ 1లో నిలిచింది. ఇక టాప్ 2లో తేజా సజ్జా హీరోగా చేసిన హనుమాన్ సినిమా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు. తేజా సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా చేసింది.

అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, దీపక్ రాజ్ శెట్టి, సముద్రతని, గెటప్ శ్రీనఉఖ, సత్య, భాను ప్రకాశ్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల అయింది. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో రిలీజ్ కాగా... జియో సినిమా వేదికగా మార్చి 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీని కూడా షేక్ చేస్తుంది. ఇలా టాప్ 2లో నిలిచిందీ చిత్రం.

ఇక టాప్ 3లో యానిమల్ సినిమా నిలిచింది. గతేడాది డిసెంబర్ ఒకటో తేదీన విడుదల అయిన ఈ సినిమా 2024 జనవరి 26వ తేదీన ఓటీటీలోకి వచ్చంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను టి - సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించగా.. విడుదల అయిన రోజు నుంచి ఇప్పటి వరకు టాప్ 3లో కొనసాగుతూనే వస్తుంది. మరి ఈ మూడు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను మీరు కూడా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. అస్సలే మిస్ అవ్వొద్దు సుమీ.


Click it and Unblock the Notifications











