చరిత్ర సృష్టిస్తున్న టాప్ 10 వెబ్ సిరీస్‌లు ఇవే.. ఇందులో మీకు నచ్చింది ఉందేమో చూడండి!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నసినీ తారలు, సినిమాలపై సర్వేలు నిర్వహిస్తూ వాటి ఫలితాలను వెల్లడిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అందరు మెచ్చిన నటీనటులతో పాటు సినిమాలు, వెబ్ సిరీస్ లకు సంబంధించిన విషయాలను కూడా చెబుతుంటుంది. అయితే తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ వెబ్ సిరీస్ లపై సర్వే చేసి వాటి ఫలితాలను వెల్లడించింది. ముఖ్యంగా జనవరి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టును తెలిపింది.
అయితే ఇండియా బేస్డ్ బజ్ ఆధారంగా సర్వే చేసిన ఈ సంస్థ టాప్ 10 వెబ్ సిరీస్ లు ఏవో ఎక్స్ వేధికగా ప్రకటించింది. ముఖ్యంగా ఇందులో అద్భుతమైన వెబ్ సిరీస్ లు ఉన్నాయి. నాగచైతన్య నటించిన ఓ సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా ఈసారి టాప్ లో నిలిచింది. అయితే మరో రియల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కిల్లర్ సూప్ కూడా టాప్ 1గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. టాప్ 10 లిస్టులో ఏయే వెబ్ సిరీస్ లు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 1లో.. కిల్లర్ సూపర్ వెబ్ సిరీస్ ఉండగా.. ఇది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. జనవరి 12వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండగా.. మనోజ్ బాజ్ పాయ్, కొంకణా సేన్ శర్మ కీలక పాత్రలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ పై కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఇక టాప్ 2లో లెజెండ్ ఆఫ్ హనుమాన్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 26 ఎపిసోడ్లు ఉండగా.. జనవరి 12వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది.
ఇక మూడో స్థానంలో ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ నిలిచింది. అయితే మొత్తం ఏడు ఎపిసోడ్ లు కల్గిన ఈ వెబ్ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా జనవరి 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ను చూసేందుకు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూడగా... అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చూస్తే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక టాప్ 4లో బెర్లిన్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. మనీ హైస్ట్ సిరీస్ కు ముందు బెర్లిన్ ఏం చేశాడో చెప్పే ఆకస్తికర కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కగా.. మొత్తం ఐదు ఎపిసోడ్ లో ఉన్నాయి. అయతే డిసెంబర్ 29వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతూ.. విశేష ప్రేక్షకాదరణ పొందింది.

అలాగే టాప్ 5లో ఎకో అనే సిరీస్ నిలిచింది. ఇది జనవరి 9వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 6లో నాగ చైతన్య హీరోగా చేసిన దూత అనే వెబ్ సిరీస్ నిలిచింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండగా.. అద్భుతమైన రెప్సాన్స్ అందుకుంది. ఇక టాప్ 7లో ది రైల్వే మేనే అనే వెబ్ సిరీస్ నిలిచింది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ప్లిక్స్ వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక టాప్ 8లో ది ఫ్రీలాన్సర్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా.. మంచి స్పందనే వచ్చింది. ఇక తొమ్మిదవ ఖో గయే హమ్ కహాన్ అనే వెబ్ సిరీస్ స్థానం దక్కించుకుంది. అర్జున్ వరైన్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేధికగా డిసెంబర్ 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక చివరగా అంటే టాప్ 10లో క్యుబిక్ లెస్ సీజన్ 3 అనే వెబ్ సిరీస్ స్థానం దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ వేధికగా జనవరి 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











