OTTలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టాప్ 10 వెబ్‌సిరీస్‌లు ఇవే.. భక్షక్ 5లో, వన్‌లో ఏముందంటే?
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సంస్థ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా సినీ తారల, సినిమాలు, వాటి ఫలితాల గురించి ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లపై కూడా సర్వే చేస్తుంది. వాటి ఫలితాలను వెల్లడిస్తూ... వేటిని ఎక్కువగా ప్రజలు ఆదరిస్తున్నారో చెబుతుంది. అయితే తాజాగా ఫిబ్రవరి 2024 కు సంబంధించిన టాప్ 10 వెబ్ సిరీస్ లు లిస్టును విడుదల చేసింది. అందులో ఏయే వెబ్ సిరీస్ లు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15వ తేదీన వరకు ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టును ఆర్మాక్స్ సంస్థ తెలిపింది. అయితే ఇండియా బేస్డ్ బజ్ ఆధారంగా.. ఇప్పటికీ విడుదల కాని ఓటీటీ ఒరిజినల్స్ ను కూడా ఆ జాబితో చేర్చింది. అయితే ఈ లిస్టులో ఏయే వెబ్ సిరీస్ లు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 1లో.. ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ నిలిచింది. అయితే మొత్తం 7 ఎపిసోడ్ లు కల్గిన ఈ వెబ్ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా జనవరి 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా.. విశేష ఆదరణ లభిస్తోంది. ఇక టాప్ 2లో ఆర్య సీజన్ 3 నిలిచింది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి డిస్నే ప్లస్ హాట్ స్టార్ వేధికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ను ఎక్కువ మంది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక టాప్ 3లో కిల్లర్ సూప్ నిలిచింది. ఇది కూడా నెట్ ఫ్లిక్స్ వేధికగానే జనవరి 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మనోజే బాజ్ పాయ్, కొంకణా సేన్ శర్మ కీలక పాత్రలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ పై కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది.

ఇక టాప్ 4లో కర్మ కాలింగ్ వెబ్ సిరీస్ నిలిచింది. వరుణ్ సూద్, నమ్రత శేత్ ప్రధఆన పాత్రల్లో రుచి నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ జనవరి 26వ తేదీ నుంచి డిస్నే ప్లస్ హాట్ స్టార్ వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కు కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఇక టాప్ 5లో భక్షక్ వెబ్ సిరీస్ నిలిచింది. భూమి పెడ్నేకర్, ఆదిత్య శ్రీవాత్సవ ప్రధఆన పాత్రల్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ పై ముందు నుంచే భారీగా అంచనాలు నమోదు అవ్వగా.. ఇప్పుడు మరింత క్రేజ్ ఏర్పడింది.

ఇక టాప్ 6లో క్రష్డ్ వెబ్ సిరీస్ నిలిచింది. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి డిస్నే ప్లస్ హాట్ స్టార్ వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్ లు కల్గిన ఈ వెబ్ సిరీస్ కు విశేష స్పందన వస్తోంది. ఇక టాప్ 7లో లెజెండ్ ఆఫ్ హనుమాన్ నిలిచింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా ఈ వెబ్ సిరీస్ లో జనవరి 12వ తేదీ నుంచి అందుబాటులోకి రాగా అనేక మంది ఈ వెబ్ సిరీస్ ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక టాప్ 8లో మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్ నిలిచింది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా ఫబ్రవరి 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక టాప్ 9లో షార్క్ టాంక్ ఇండియా సీజన్ 3 నిలిచింది. జనవరి 22వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుండగా... నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక చివరి స్థానంలో అంటే టాప్ 10లో హస్ట్లర్స్ వెబ్ సిరీస్ నిలవగా.. అమెజాన్ మినీ టీవిలో వస్తోంది. జనవరి 24 తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. మీరు కూడా ఓసారి ఈ వెబ్ సిరీస్ లను ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











