Top 10 Web Series: టాప్ 10 వెబ్ సిరీస్‌లలో మహేష్ బాబు మెచ్చిందే ఫస్ట్ ప్లేస్‌లో.. ఏదో అర్థమైందా?
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి దేశ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ తారలు, సినిమాలు, వాటి ఫలితాల గురించి ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ సరైన ఫిలతాలను వెల్లడిస్తుంటుంది. అయితే తాజాగా ఈ సంస్థ టాప్ 10 వెబ్ సిరీస్ లు ఏవనే దానిపై సర్వే నిర్వహించింది. ఆ వివరాలను ఎక్స్ వేధికగా ప్రకటించింది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 29వ వరకు ఉన్న టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టును రిలీజ్ చేసింది. అయితే ఇండియా బజ్ బేస్డ్ ఆధారంగా విడుదల చేసిన ఈ టాప్ 10 వెబ్ సిరీస్ లలో ఏమేం ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టులో మొదటి స్థానంలో మహేష్ బాబు మెచ్చిన వెబ్ సిరీస్ ఉంది. అదేంటీ అనుకుంటున్నారా.. ఇండియాలోనే అతిపెద్ద రియల్ క్రైమ్ థ్రిల్లర్ పోచర్. రిచీ మెహతా దర్శకత్వంలో నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దిబ్యేందు భట్టాచార్య, రంజితా మేనన్ సహా తదితరులు ఇందులో నటించగా.. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే టాప్ 2లో అవతార్: ది లాస్ట్ ఎయిర్ బెండర్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ వేధికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ను చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక టాప్ 3లో ఆర్య సీజన్ 3 నిలిచింది. సుస్మితా సేన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. విడుదల అయినప్పటి నుంచి ఈ వెబ్ సిరీస్ ను చాలా మంది ఓటీటీ వేధికగా వీక్షిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నాలుగో స్థానంలో ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. అయితే మొత్తం ఏడు ఎపిసోడ్ లు కల్గిన ఈ వెబ్ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా జనవరి 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక టాప్ 5లో సన్ ఫ్లవర్ సీజన్ 2 నిలిచింది. నవీన్ గుజ్రాల్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ మార్చి ఒకటవ తేదీ నుంచి జీ5 వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. సునీల్ గ్రోవర్, ఆదా శర్మ, ఆశిష్ విద్యార్థి, రణ్ వీర్ శోరే వంటి వాళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ను కూడా ఓటీటీ ప్రియులు ఆసక్తిగా చూస్తున్నారు. అలా ఈ వెబ్ సిరీస్ ఐదో స్థానంలో నిలిచింది. ఇక ఆరో స్థానంలో మహారాణి సీజన్ 3 నిలిచింది. సౌరభ్ బేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ సీనీ లివ్ వేధికగా మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ను చూడాలాని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక టాప్ 7లో భక్షక్ నిలిచింది. పుల్ కిత్ దర్శకత్వంలో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా నిలిచిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేధికగా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్రీమంగ్ అవుతుంది. అద్భుతంగా ఉండడంతో ఇప్పటికీ దీన్ని అనేక మంది చూస్తున్నారు. ఇక టాప్ 8లో కర్మ కాలింగ్ నిలిచింది. మొత్తం 7 ఎపిసోడ్ లు కల్గిన ఈ వెబ్ సిరీస్ లో రవీనా టాండన్, నమ్రతా సేథ్, వరుణ్ సూద్, వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా జనవరి 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇక టాప్ 9లో షో టైమ్ నిలిచింది. అర్చిత్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో ఇమ్రాన్ హష్మి, నసీరుద్దిన్, మౌనీ రాయ్, మహిమ, రాజీవ్ ఖండేల్వాల్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే శోగున్ అనే వెబ్ సిరీస్ 10వ స్థానంలో నిలిచింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో మీరు ఏదైనా చూసి ఉండకపోతే ఇప్పుడే వెళ్లి చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











