సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టాప్ 10 వెబ్‌సిరీస్‌లు ఇవే.. వన్‌లో పోచర్, మిగతా స్థానాల్లో ఏమున్నాయంటే?
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి.. ఆ సంస్థ చేసే సర్వేల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ తారలు, సినిమాలు, వాటి ఫలితాల గురించి ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ సరైన ఫిలతాలను వెల్లడిస్తుంటుంది. తాజాగా ఈ సంస్థ టాప్ 10 వెబ్ సిరీస్ లు ఏవనే దానిపై సర్వే నిర్వహించింది. ఇప్పటికే విడుదల అయినవి మాత్రమే కాకుండా రాబోయే వెబ్ సిరీస్ లలో కూడా టాప్ 10 ఏవో ఎక్స్ వేదికగా ప్రకటించింది. ముఖ్యంగా మార్చి 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉన్న ఈ టాప్ 10 వెబ్ సిరీస్ లు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్మాక్స్ రిలీజ్ చేసిన టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టులో మొదటి స్థానంలో.. ఇండియాలోనే అతిపెద్ద రియల్ క్రైమ్ థ్రిల్లర్ పోచర్ నిలిచింది. రిచీ మెహతా దర్శకత్వంలో నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దివ్యేందు భట్టాచార్య, రంజితా మీనన్ సహా తదితరులు ఇందులో నటించగా.. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే టాప్ 2లో మర్డర్ ముబారక్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. మార్చి 15వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ను అనేక మంది చూస్తున్నారు.

ఇక టాప్3లో మహారాణి సీజన్ 3 నిలవగా.. సౌరభ్ బేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ సీనీ లివ్ వేదికగా మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ను అనేక మంది చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక టాప్ 4లో షో టైమ్ నిలిచింది. అర్చిత్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో ఇమ్రాన్ హష్మి, నసీరుద్దిన్, మౌనీ రాయ్, మహిమ, రాజీవ్ ఖండేల్వాల్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక ఐదో స్థానంలో సన్ ఫ్లవర్ సీజన్ 2 నిలిచింది. నవీన్ గుజ్రాల్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ మార్చి 1వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. సునీల్ గ్రోవర్, ఆదా శర్మ, ఆశిష్ విద్యార్థి, రణ్ వీర్ శోరే వంటి వాళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ను కూడా ఓటీటీ ప్రియులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక టాప్ 6లో ఇండియన్ పోలీస్ ఫోర్స్ నిలిచింది. అయితే మొత్తం ఏడు ఎపిసోడ్ లు కల్గిన ఈ వెబ్ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జనవరి 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక టాప్ 7లో లూటేరే వెబ్ సిరీస్ నిలిచింది. రజత్ కపూర్, వివేక్ గోంబర్, అమృతా ఖన్విల్కర్, చందన్ రాయ్ సన్యాల్, ప్రీతికా చావ్లా వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ 2 ఎపిసోడ్ లు ఇప్పటికీ విడుదల కాగా మార్చి 28వ తేదీన మరో ఎపిసోడ్ రిలీజ్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 8లో మామ్లా లీగల్ హై నిలిచింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక టాప్ 9లో డామ్ సెల్ వెబ్ సిరీస్ నిలవగా.. మార్చి 8వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే టాప్ 10గా బిగ్ గర్ల్స్ డోంట్ క్రై అనే వెబ్ సిరీస్ నిలిచింది. అవంతిక వందనపు నటించిన ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మార్చి 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











