అందరు మెచ్చిన టాప్ 10 వెబ్ సిరీస్‌లు.. ఏ ఒక్కటి మిస్ అయినా!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతీ వారం, నెల, ఏడాదికి ఒకసారి సర్వేలు చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా దేశంలో ఉన్న సెలబ్రిటీలు, సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీల్లో వచ్చే సీరియల్స్.. ఇలా అన్నింటిపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ సరైన ఫిలతాలను వెల్లడిస్తుంటుంది. తాజాగా ఈ సంస్థ టాప్ 10 వెబ్ సిరీస్ లు ఏవనే దానిపై సర్వే నిర్వహించింది. ఇప్పటికే విడుదల అయినవి మాత్రమే కాకుండా రాబోయే వెబ్ సిరీస్ లలో కూడా టాప్ 10 ఏవో ఎక్స్ వేదికగా ప్రకటించింది. ముఖ్యంగా మార్చి 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉన్న ఈ టాప్ 10 వెబ్ సిరీస్ లు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్మాక్స్ రిలీజ్ చేసిన టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టులో మొదటి స్థానంలో.. మర్డర్ ముబారక్ నిలిచింది. మార్చి 15వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ను అనేక మంది చాలా ఆసక్తిగా చూస్తుండగా.. టాప్ 1లోకి వచ్చేసింది. ఇక టాప్ 2లో ఏ వతన్ మేరే వతన్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించి ఈ వెబ్ సిరీస్ మార్చి 21వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. భారతదేశ స్వాతంత్రోద్యమ సమయంలో దేశం కోసం నిస్వార్థంగా పని చేసిన పలువురు గురించి ఈ వెబ్ సిరీస్ లో క్లుప్తంగా చూపించారు.

ఇక మూడో స్థానంలో ఇండియాలోనే అతిపెద్ద రియల్ క్రైమ్ థ్రిల్లర్ పోచర్ నిలిచింది. రిచీ మెహతా దర్శకత్వంలో నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దివ్యేందు భట్టాచార్య, రంజితా మీనన్ సహా తదితరులు ఇందులో నటించగా.. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. అద్భుతమైన కథాంశంతో వచ్చిన ఈ సిరిస్ ను ఎక్కువ మంది చూస్తుండగా.. టాప్ 3లో నిలిచింది. అలాగే ఇక టాప్ 4లో లూటేరే అనే వెబ్ సిరీస్ నిలిచింది. రజత్ కపూర్, వివేక్ గోంబర్, అమృతా ఖన్విల్కర్, చందన్ రాయ్ సన్యాల్, ప్రీతికా చావ్లా వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ 2 ఎపిసోడ్ లు ముందే విడుదల కాగా మార్చి 28వ తేదీన మరో ఎపిసోడ్ ను విడుదల చేశారు.

ఇక టాప్ 5లో మహారాణి సీజన్ 3 అనే వెబ్ సిరీస్ నిలిచింది. సౌరభ్ బేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ సీనీ లివ్ వేదికగా మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ను అనేక మంది చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అలాగే టాప్ 6లో షో టైమ్ నిలిచింది. అర్చిత్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో ఇమ్రాన్ హష్మి, నసీరుద్దిన్, మౌనీ రాయ్, మహిమ, రాజీవ్ ఖండేల్వాల్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.

టాప్ 7లో సన్ ఫ్లవర్ సీజన్ 2 అనే వెబ్ సిరీస్ నిలిచింది. నవీన్ గుజ్రాల్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ మార్చి 1వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. సునీల్ గ్రోవర్, ఆదా శర్మ, ఆశిష్ విద్యార్థి, రణ్ వీర్ శోరే వంటి వాళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ను కూడా ఓటీటీ ప్రియులు ఆసక్తిగా చూస్తున్నారు. అలాగే టాప్ 8లో 3 బాడీ ప్రాబ్లమ్స్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. మార్చి 21వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండగా.. చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు.

అలాగే టాప్ 9లో మామ్లా లీగల్ హై అనే వెబ్ సిరీస్ నిలిచింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక చివరి స్థానంలో అంటే పదో స్థానంలో టాప్ 10లో ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. మొత్తం 7 ఎపిసోడ్ లు కల్గిన ఈ వెబ్ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జనవరి 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికీ ఈ వెబ్ సిరీస్ ను చాలా మంది చూస్తూనే ఉన్నారు.


Click it and Unblock the Notifications











