సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టాప్ 10 వెబ్‌ సిరీస్‌లు..రెండో స్థానంలో కిల్లర్ సూప్,మొదటి స్థానంలో ఏదుందో తెలుసా

అందరికీ చాలా బాగా తెలిసిన ఆర్మాక్స్ మీడియా సంస్థ ఎప్పటికప్పుడు దేశ వ్యాప్తంగా సినీ తారలు, సినిమాలు, వాటి ఫలితాల గురించి సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. కేవలం సినిమాలో కాకుండా వెబ్ సిరీస్ లపై కూడా సర్వేలు చేస్తుంటుంది. అయితే తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ చేసిన ఓ సర్వేలో టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టును విడుదల చేసింది. అయితే జనవరి 5వ తేదీ నుంచి 11వ తేదీన వరకు ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టును తెలిపింది. అయితే ఇండియా బేస్డ్ బజ్ ఆధారంగా.. ఇప్పటికీ విడుదల కాని ఓటీటీ ఒరిజినల్స్ ను రిలీజ్ చేసింది. ఆ లిస్టులో ఏయే వెబ్ సిరీస్ లు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 1లో.. బెర్లిన్ అనే వెబ్ సిరీస్ ఉండగా.. ఇది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వేధికాగ స్ట్రీమింగ్ అవుతుంది. మనీ హైస్ట్ సిరీస్ కు ముందు బెర్లిన్ ఏం చేశాడో చెప్పే ఆకస్తికర కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కగా.. మొత్తం ఐదు ఎపిసోడ్ లో ఉన్నాయి. అయతే డిసెంబర్ 29వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతూ.. విశేష ప్రేక్షకాదరణ పొందింది. అలాగే టాప్ 2లో కిలర్ సూప్ వెబ్ సిరీస్ నిలిచింది. ఇది కూడా నెట్ ఫ్లిక్స్ వేధికగానే జనవరి 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మనోజే బాజ్ పాయ్, కొంకణా సేన్ శర్మ కీలక పాత్రలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ పై కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది.

Ormax Released Top 10 OTT Web Series of Originals in India Based on Buzz Check Details

ఇక టాప్ 3లో ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ నిలిచింది. అయితే మొత్తం ఏడు ఎపిసోడ్ లు కల్గిన ఈ వెబ్ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా జనవరి 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ను చూసేందుకు కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక నాలుగో స్థానంలో ఎకో అనే సిరీస్ నిలిచింది. ఇది జనవరి 9వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 5లో ఖో గయే హమ్ కహాన్ అనే వెబ్ సిరీస్ స్థానం దక్కించుకుంది. అర్జున్ వరైన్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేధికగా డిసెంబర్ 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

టాప్ 6లో ది రైల్వే మెన్ వెబ్ సిరీస్ స్థానం సంపాధించుకుంది. నాలుగు ఎపిసోడ్ లు కల్గిన ఈ వెబ్ సిరీస్ 2023 నవంబర్ 18వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ప్లిక్స్ వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. దీని తర్వాత అంటే ఏడో స్థానంలో ది ఫ్రీలాన్సర్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా.. మంచి స్పందనే వచ్చింది. ఇక ఎనిమిదివ స్థానంలో అక్కినేని నాగచైతన్య హీరోగా చేసిన దూత వెబ్ సిరీస్ నిలిచింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అందుబాటులో ఉంది.

ఇక తొమ్మిదో స్థానంలో లెజెండ్ ఆఫ్ హనుమాన్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 26 ఎపిసోడ్లు ఉండగా.. జనవరి 12వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇక చివరి స్థానంలో అంటే టాప్ 10లో ఫ్లేమ్స్ సీజన్ 4 నిలిచింది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా డిసెంబర్ 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ పది వెబ్ సిరీస్ లకు దేశ వ్యాప్తంగా విపరీతమైన బజ్ ఏర్పడింది. మీరు కూడా ఓసారి ఈ వెబ్ సిరీస్ లను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X