OTTలో దుమ్మురేపుతున్న సుస్మితా సేన్.. ఈ టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్ మీరు చూశారా?
కంటెంట్ బాగుంటే సినీ ప్రేక్షకులు ఎవరు నటించారు.. ఏంటి అనేది చూడరు.. అది సినిమానా.. సిరీసా అనేది కూడా పట్టించుకోరు. ఇక ప్రేక్షకులకు నచ్చితే బ్రహ్మరథం పట్టేస్తారు. ఇండియాలో టాప్ 10 ఓటీటీ ఒరిజినల్స్ లిస్టును రిలీజ్ చేసింది ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ. ఆ లిస్టులో టాప్ 10 చిత్రాలు, వెబ్ సిరిసులు ఉన్నాయి. అన్నింట్లో టాప్ 1 గా ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ నిలవగా.. రెండో స్థానంలో సుస్మితా సేన్ వెబ్ సిరీస్ నిలిచింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్.. సీని ప్రముఖులపై సర్వే నిర్వహిస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఓటీటీల్లో ది బెస్ట్ టాప్ 10 ఒరిజినల్స్ ఏంటి అనే దానిపై ఇండియాలో సర్వే నిర్వహించింది. ఇక వీటిలో టాప్ 10 వెబ్ సిరీస్ లు, సినిమాలు ఇవే అంటూ ఓ లిస్ట్ విడుదల చేసింది. అందులో హాలీవుడ్ టు టాలీవుడ్ సినిమాలు, సిరీసులు ఉన్నాయి.

ఇక టాప్ 1 ప్లేస్ లో మార్వేల్ సూపర్ హీరోస్ లో ఒకరైనా లోకి అందరికి తెలిసిందే. ది సూపర్ థోర్ ( ఉరుముల దేవుడు) తమ్ముడు అయిన లోకి.. ఆయన గురించి ఓ వెబ్ సిరీస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే మొదటి సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో.. లోకి సీజన్ 2 తెరకెక్కించారు. ఇక ఈ సీజన్ కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సీజన్ ను ఇండియాలో అత్యధిక మంది ఆదరిస్తున్నారు. టాప్ 10 ఒరిజినల్స్ లో లోకీ వెబ్ సిరీస్ టాప్ 1గా నిలిచింది.
టాప్ 2 ప్లేస్ లో సుస్మీతా సేన్ నటించిన ఆర్య సీజన్ 3 నిలిచింది. ఇక మొదటి రెండు సీజన్స్ సక్సెస్ కావడంతో.. 3వ సీజన్ తెరకెక్కించారు. ఇది కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 3 ప్లేస్ లో అస్పిరెంట్స్ సీజన్ 2 నిలిచింది. ఇది అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక టాప్ 4 లో కాలా పానీ వెబ్ సిరీస్ నిలిచింది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మొదటి సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో... కాలా పానీ 2 కూడా తెరకెక్కించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక టాప్ 5లో స్కామ్ 2003 నిలిచింది. ఇప్పటికే స్కామ్ మొదటి సీజన్ కు మంచి ఆదరణ లభించగా.. స్కామ్ 2003కి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సీరిస్ సోనీలివ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక టాప్ 6లో సుల్తాన్ ఆఫ్ దిల్లీ సిరీస్ నిలిచింది. ఈ సీరిస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరక్కిన ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈరోజే నెట్ ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అయిన ది రైల్వే మెన్ టాప్ 7లో నిలిచింది. భూపాల్ లో జరిగిన ప్రమాదం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. మాధవన్ నటించిన ఈ సీరిస్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ అయిన మొదటి రోజే టాప్ 7లో నిలవడం గమనార్హం.
ఇక టాప్ 8లో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న జెన్ వీ, టాప్ 9లో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఓంకార్ మాన్షన్ 24 నిలిచాయి. ఇక టాప్ 10లో మృణాల్ ఠాకూర్, ఇషాన్ కట్టర్ నటించిన పిప్పా చిత్రం నిలిచింది. ఇది డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇవండి టాప్ 10 ఒరిజల్స్.. మీరు కనుగ ఈ సీరిసులు, సినిమాలు మిస్ అయితే.. ఓటీటీలో చూసేయండి.


Click it and Unblock the Notifications











